twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అర్జున్ సురవరంపై ఎలక్షన్ ఎఫెక్ట్.. వాయిదా వేస్తారా!

    |

    యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం జర్నలిస్ట్ గా అర్జున్ సురవరం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. టి సంతోష్ దర్శత్వంలో ఈ చిత్రం తెరెక్కుతోంది. కమర్షియల్ చిత్రాల జోలికి పోకుండా విభిన్నమైన కథలు ఎంచుకుంటూ నిఖిల్ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. నిఖిల్ కొత్తగా ట్రై చేసిన ప్రతి సారి మంచి విజయం దక్కుతోంది. దర్శకుడు ఈ చిత్రాన్ని ఉత్కంఠ భరితంగా సాగే కథనంతో రూపొందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మార్చి 29న విడుదల చేసేందుకు ముందుగా ప్లాన్ చేశారు.

    విడుదల సమయం దగ్గరపడుతున్నా ఎలాంటి హడావిడి కనిపించడం లేదు. దీనితో ఈ చిత్రం వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో చిత్రాన్ని రిలీజ్ చేయడం వలన వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిర్మాతలు భావిస్తున్నారు.ఏప్రిల్‌లో వరుసగా చిత్రాలు విడుదల కానున్నాయి.

    Young hero Nikhils Arjun Suravaram movie release postpone

    దీనితో అర్జున్ సురవరం చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తే బావుంటుందని నిర్మాతలు ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ముందుగా ముద్ర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ విషయంలో ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ అభ్యంతరం చెప్పారు. ఆ టైటిల్‌ని ముందుగా తాను రిజిస్టర్ చేయించుకున్నానంటూ రచ్చకెక్కడంతో అర్జున్ సురవరం అనే టైటిల్ ని ఎంపిక చేశారు. నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది.

    English summary
    Young hero Nikhil's Arjun Suravaram movie release postpone
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X