Don't Miss!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అర్జున్ సురవరంపై ఎలక్షన్ ఎఫెక్ట్.. వాయిదా వేస్తారా!
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం జర్నలిస్ట్ గా అర్జున్ సురవరం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. టి సంతోష్ దర్శత్వంలో ఈ చిత్రం తెరెక్కుతోంది. కమర్షియల్ చిత్రాల జోలికి పోకుండా విభిన్నమైన కథలు ఎంచుకుంటూ నిఖిల్ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. నిఖిల్ కొత్తగా ట్రై చేసిన ప్రతి సారి మంచి విజయం దక్కుతోంది. దర్శకుడు ఈ చిత్రాన్ని ఉత్కంఠ భరితంగా సాగే కథనంతో రూపొందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మార్చి 29న విడుదల చేసేందుకు ముందుగా ప్లాన్ చేశారు.
విడుదల సమయం దగ్గరపడుతున్నా ఎలాంటి హడావిడి కనిపించడం లేదు. దీనితో ఈ చిత్రం వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో చిత్రాన్ని రిలీజ్ చేయడం వలన వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిర్మాతలు భావిస్తున్నారు.ఏప్రిల్‌లో వరుసగా చిత్రాలు విడుదల కానున్నాయి.
దీనితో అర్జున్ సురవరం చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తే బావుంటుందని నిర్మాతలు ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ముందుగా ముద్ర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ విషయంలో ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ అభ్యంతరం చెప్పారు. ఆ టైటిల్‌ని ముందుగా తాను రిజిస్టర్ చేయించుకున్నానంటూ రచ్చకెక్కడంతో అర్జున్ సురవరం అనే టైటిల్ ని ఎంపిక చేశారు. నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తోంది.