చైనా కుట్రను బయటపెట్టిన యువ హీరో నిఖిల్.. కరోనా విజృంభనకు కారణమిదే!
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు ఒక్కసారిగా షాక్ కి గురయ్యాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోగా లక్షల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా భయపెడుతున్న కరోనా మహమ్మారికి కారణం ఎవరంటే అందరూ చైనా వైపే చూస్తున్నారు. ఇక చైనా మాత్రం గుంట నక్కలా నాటకాలు చేస్తూ తమకేమీ తెలియదు అన్నట్లుగా కథలు అల్లుతోంది.

నిఖిల్ సిద్దార్థ్ షాకింగ్ కామెంట్స్..
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఒక దేశం కుట్రపూరిత చర్య అని హీరో నిఖిల్ చైనా గురించి కొన్ని ఉదాహారణలను అందించాడు. చైనా కావాలనే ఈ వైరస్ ని ప్రపంచానికి వ్యాపింపజేసిందని ప్రపంచంలో ఇప్పటికే అనేక రకాల దేశాలు దృవీకరించాయి. ఇక వూహన్ నగరంలో జనవరిలో మొదలైన వైరస్ ప్లాన్ ప్రకారం విదేశాలకు వ్యాపింపజేసినట్లు నిఖిల్ పేర్కొన్నాడు.

కుట్రలో భాగమే..
చైనా వూహన్ లో వైరస్ ఉందని ఆ దేశంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా వైరస్ వ్యాపించకుండా చైనాలో వూహన్ నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా వ్యవస్థను నిలిపివేశారు. కానీ వూహన్ నుంచి ఇతర దేశాలకు మాత్రం విమాన రాకపోకలు జరిగాయని ఇది కుట్రలో భాగమే అని నిఖిల్ తెలిపారు.

నిఖిల్ పెళ్లి వాయిదా..
నిఖిల్ కూడా మొన్నటివరకు ఈ నెలలోనే తన ప్రేయసిని పెళ్లాడడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. కానీ కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో నిఖిల్ పెళ్లి కూడా వాయిదా పడింది. కనీసం కుటుంబ సభ్యుల సమక్షంలో అయినా సింపుల్ గా పెళ్లి చేసుకోవాలని అనుకున్న నిఖిల్ కి లాక్ డౌన్ పొడగింపు మరొక షాక్ ఇచ్చింది.
Recommended Video

వైద్యులకు సహాయం..
హైదరాబాద్ లో నిఖిల్ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. కరోనా కోసం పోరాడుతున్న డాక్టర్లు వైరస్ భారిన పడకుండా నిఖిల్ మెడికల్ కి సంబంధించిన శానిటైజర్స్, మాస్క్ లు అలాగే ఇతర సామగ్రిని ఇచితంగా అందజేశారు. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా నిఖిల్ జనాలకు కరోనా నిర్ములనపై అవగాహన కల్పించేలా సందేశాల్ని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











