టాలీవుడ్‌కు మరో యువ హీరో.. విభిన్నమైన సినిమాతో రెడీ..
తెలుగు సినీ పరిశ్రమకు మరో ప్రతిభావంతుడైన యువకుడు హీరోగా పరిచయం కాబోతున్నారు. ఆర్‌వీజీ మూవీస్, ఎస్‌వీఎల్ ఎంటర్‌ప్రైజెస్ సంయుక్తంగా రూపొందించే చిత్రం ద్వారా శివాంశు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని సత్యసాయి నిగమాగమంలోని గణేష్ టెంపుల్‌లో జరిగింది. ముహూర్తపు షాట్‌కు... మాటలు-పాటలు అందిస్తున్న ప్రముఖ రచయిత వీఎస్‌పి తెన్నేటి కెమెరా స్విచాన్ చేయగా, శ్రీమతి స్వాతి రుద్రాపట్ల క్లాప్ కొట్టారు.
ఈ చిత్రానికి రవిశంకర్ ఓంకాలి, తలారి వినోద్ కుమార్ ముదిరాజ్, శ్రీనివాస్ మామిడాల, లలిత్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు దర్శకుడిగా రుద్రాపట్ల వేణుగోపాల్ వ్యవహరించనున్నారు.

యువ హీరో శివాంశు సరసన ప్రాచీరాయ్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ ఆమని ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.
దర్శక, నిర్మాత రుద్రాపట్ల వేణుగోపాల్ మాట్లాడుతూ... నా రూపొందించే ప్రతి చిత్రంలో కొత్తవారిని పరిచయం చేయడం అలవాటు. అదే క్రమంలో శివాంశును హీరోగా పరిచయం చేస్తున్నాను అని అన్నారు.


Click it and Unblock the Notifications