త్రివిక్రమ్, బన్నీ సినిమాలో కీలక పాత్రలో యంగ్ హీరో!
నా పేరు సూర్య విడుదలైన దాదాపు ఏడాది తర్వాత అల్లు అర్జున్ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని ఈ చిత్ర పూజా కార్యక్రమం శనివారం జరిగింది. మంచి కథ కోసం ఎదురు చూస్తున తరుణంలో తనకు అచొచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ తోనే బన్నీ సినిమా ప్రారంభించాడు. త్రివిక్రమ్, బన్నీ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రాలని మించేలా అల్లు అర్జున్ 19వ చిత్రాన్ని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో నాగార్జున మేనల్లుడు, యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుశాంత్ హీరోగా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరిగా రాణించడం లేదు. దీనితో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే నటించే అవకాశం రావడం సుశాంత్ కెరీర్ కు మంచిదని అంటున్నారు. చాలా మంది యువ హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారుతూ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఆది పినిశెట్టి రంగస్థలం చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక నవీన్ చంద్ర అరవింద సమేత చిత్రంలో నెగిటివ్ రోల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అల్లు అర్జున్ చిత్రంలో సుశాంత్ నటించడంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బన్నీ సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీత దర్శకుడు. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది.


Click it and Unblock the Notifications











