ఒకే వేదికపై టాలీవుడ్ హీరోలు.. వైసీపీ లీడర్స్: అందరినీ కలుపుతున్న సందీప్ కిషన్

చాలా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నా.. సరైనా బ్రేక్‌లను మాత్రం అందుకోలేకపోతున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో చిత్రాల్లో నటించినా.. కేవలం మూడు నాలుగు హిట్లను మాత్రమే తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక, ఈ ఏడాది ఆరంభంలో 'ఏ1 ఎక్స్‌ప్రెస్' అనే సినిమా చేశాడు. దీనికి పాజిటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ పరంగా హిట్ స్టేటస్‌ను దక్కించుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా భారీ విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే 'గల్లీ రౌడీ' అనే సినిమాలో నటించాడు.

వినోదాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే జీ నాగేశ్వర్‌ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ నటించిన చిత్రమే 'గల్లీ రౌడీ'. చాలా రోజుల క్రితమే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీని జూలైలోనే విడుదల చేయాలని భావించారు. కానీ, కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా అప్పుడు ఇది సాధ్య పడలేదు. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తారన్న టాక్ వినిపించింది. కానీ, ఇటీవలే ఈ సినిమాను సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, దీన్ని అప్పుడు కూడా విడుదల చేయలేదు. దీంతో అసలు ఇది ఎప్పుడొస్తుందా అని అంతా వేచి చూశారు.

Young Heroes and YCP Leaders to Attend Sundeep Kishans Gully Rowdy Pre Release Event

కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఈ కారణంగానే 'గల్లీ రౌడీ' చిత్ర రిలీజ్‌ను ఆపేశారని జోరుగా ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాను సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. అంతేకాదు, థియేటర్లలో నవ్వుల జల్లులు కురవబోతున్నాయని చెప్పి అంచనాలు పెంచేశారు. ఇక, ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడడంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసేశారు. ఇందులో భాగంగానే బుధవారం రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు.

'గల్లీ రౌడీ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చాలా మంది ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేయబోతున్నారు. సినీ పరిశ్రమ నుంచి హీరోలు సునీల్, సుధీర్ బాబు, ఆది సాయి కుమార్, విశ్వక్ సేన్, కార్తికేయ గుమ్మకొండ, కిరణ్ అబ్బవరం, తేజ సజ్జా ఈ వేడుకకు రాబోతున్నారు. అలాగే, ఈ సినిమాను నిర్మించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ కావడంతో పలువురు రాజకీయ నాయకులు కూడా రానున్నారు. ఏపీ మంత్రి కొడాలి నాని, వంశీ, ఎంవీవీ సత్యనారాయణ, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో పాటు పలువురు నాయకులు విచ్చేయబోతున్నారు. దీంతో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Young Heroes and YCP Leaders to Attend Sundeep Kishans Gully Rowdy Pre Release Event

క్రేజీ కాంబినేషన్‌లో కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'గల్లీ రౌడీ' మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. విశాఖపట్నం బ్యాగ్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో సందీప్ కిషన్ తొలిసారి పూర్తి స్థాయిలో కామెడీ రోల్‌ను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాను కోన ఫిల్మ్ కార్పోరేషన్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ కాగా, బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, హర్షలు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X