ఆ ఇద్దరిని ముద్దుల్లో ముంచెత్తిన బాలకృష్ణ
బాబీ కొల్లి దర్శకత్వంలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజై హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందే ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్ షోలు, ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ పడగా.. మార్నింగ్ షో నుంచే డాకు మహారాజ్‌కు పాజిటివ్ రివ్యూలు , మౌత్ టాక్ వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటోంది.
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీదున్న బాలయ్య .. డాకు మహారాజ్‌తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతి సీజన్‌లో తనకు తిరుగులేదని పోటీలో ఎంతమంది ఉన్నా తనను టచ్ చేయలేరని నిరూపించుకున్నారు బాలకృష్ణ. అలాగే దర్శకుడు బాబీ కూడా తన కెరీర్‌లో మరో మెమొబరబుల్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ కావడంతో హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ పెట్టి సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది.

సంక్రాంతికి హిట్‌గా నిలిచిన డాకు మహారాజ్ సక్సెస్ మీట్ గ్రాండ్‌గా చేస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ మీడియాకు తెలిపారు. తొలుత ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సిన అనంతపురంలో ఈ కార్యక్రమం రద్దు కావడంతో సక్సెస్ మీట్ అక్కడే నిర్వహిస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు. అనంతరం చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి , బాణాసంచా కాల్చారు. స్వయంగా డైరెక్టర్ బాబీ బాణాసంచా కాల్చడం విశేషం. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో పలువురు శ్రీవారి భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో అనంతపురంలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలాఉండగా.. సంక్రాంతికి హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణకు సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆయనకు అభినందనలు చెబుతూ పోస్టర్లు పెడుతున్నారు. రోటిన్ కమర్షియల్ సినిమానే అయినా పండుగకు కావాల్సిన అన్ని అంశాలు ఉండటంతో బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రీమియర్స్, స్సెషల్ షోలతో కలిపి డాకు మహారాజ్ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ. 25 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇది నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ కావడం విశేషం. సంక్రాంతి సీజన్ ముగిసేనాటికి బాలయ్య ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.
Congratulations #NBK sir 🔥💥💥#DaakuMaharaj pic.twitter.com/YQigBqVQNW
— VishwakSen (@VishwakSenActor) January 12, 2025
ఇక నందమూరి బాలకృష్ణకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయిన హీరోలు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డలు .. డాకు మహారాజ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. తమ అభిమాన హీరో బాలయ్యతో కలిసి ఈ యువ హీరోలు సందడి చేశారు. ఆయనకు సిద్ధూ, విశ్వక్ సేన్‌లు ముద్దు పెట్టగా.. బాలయ్య కూడా వారిద్దరికి రివర్స్‌లో ముద్దు పెట్టారు. ఇది నా సక్సెస్ కాదని, ఫిల్మ్ ఇండస్ట్రీ సక్సెస్ అంటూ బాలకృష్ణ అన్నారు. ప్రస్తుతం వీరి ముగ్గురి అల్లరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











