బాలకృష్ణకు కూతురి పాత్రలో బ్యూటీఫుల్ హీరోయిన్.. అలా సెట్ చేసిన కామెడీ దర్శకుడు!
నందమూరి బాలకృష్ణ కూడా నేటి తరం యువ హీరోల తరహాలోనే చాలా వేగంగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నా బాలయ్య ఆ తరువాత మరొక ఇద్దరు దర్శకులకు కూడా లైన్ లో పెట్టారు. అయితే నందమూరి బాలకృష్ణ 108వ ప్రాజెక్టులో ఆయన కూతురుగా ఒక గ్లామరస్ బ్యూటీ కనిపించబోతున్నట్లు సమాచారం. ఆమె ఎవరు ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది.. అనే వివరాల్లోకి వెళితే..

మరో మాస్ మూవీ
నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత చేయబోయే సినిమాలు కూడా అంతకుమించి అనేలా అభిమానులను ఆకట్టుకోవాలని ప్రతి చిన్న విషయంలో కూడా బాలయ్య బాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న 107వ సినిమా కూడా మాస్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అప్పట్లో రామారావు
ఇక అనిల్ రావిపూడి దర్శకత్వం లో కూడా నందమూరి బాలకృష్ణ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదివరకే వీరి కలయికలో ఒక సినిమా రావాల్సింది. పటాస్ అనంతరం అనిల్ రామారావు అనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించి బాలయ్య బాబు కోసం కథ రెడీ చేసుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్ చర్చలు దశలోనే ఆగిపోయింది.

పవర్ఫుల్ పాత్రలో..
ప్రస్తుతం F 3 సినిమా ప్రమోషన్స్ లో దర్శకుడు అనిల్ రావిపూడి బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రమోషన్ ఇంటర్వ్యూలలో అనిల్ బాలయ్యతో చేయబోయే సినిమా గురించి కూడా చెబుతున్నారు. ఆయనను గతంలో ఎప్పుడూ చూపించని ఒక పవర్ ఫుల్ పాత్రలో చూపించబోతున్నట్లు తెలియజేశారు.

క్యారెక్టర్ తోనే సినిమా
తన సినిమాల్లో ఆడియన్స్ ఎక్కువగా కామెడీని కోరుకుంటారు అని కాకపోతే ఈసారి నందమూరి బాలకృష్ణను ఎవరు చూపించని తరహాలో చూపించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఆ సినిమా ఎక్కువగా క్యారెక్టర్ ను బేస్ చేసుకొని ఉంటుంది అని తప్పకుండా బాలయ్య బాబును చూసిన తర్వాత ప్రతి ప్రేక్షకుడు కూడా బ్యాపిగా ఫీల్ అవుతాడనే నమ్మకం ఉంది అని వివరణ ఇచ్చాడు.

45 ఏళ్ళ వయసున్న క్యారెక్టర్
ఇప్పటికే NBK108 ప్రాజెక్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్ పనులన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పిన అనిల్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలియజేశారు. అయితే ఆ సినిమాలో బాలయ్య బాబు 45 ఏళ్లకు పైబడిన వ్యక్తిగా కనిపించబోతున్నట్లు గా వివరణ ఇచ్చాడు. అంతే కాకుండా ఒక ఇరవై ఏళ్ల అమ్మాయికి తండ్రిగా కూడా కనిపిస్తాడు అని తెలియజేశారు.

బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల
అందులో బాలకృష్ణ కూతురి పాత్రలో పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటించబోతున్నట్లు కూడా అనిల్ రావిపూడి వివరణ ఇచ్చాడు. ఈ బ్యూటీ ఇప్పటికే రవితేజతో అలాగే కొంతమంది యువ హీరోలతో కూడా నటించే అవకాశం అందుకుంది. ఇక ఇప్పుడు బాలయ్య బాబుకు కూతురి పాత్రలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా అనిల్ క్లారిటీ ఇచ్చాడు. మరి ఈ పాత్రతో శ్రీలీల ఇంకా ఏ స్థాయిలో ఆకట్టుకుంటోంది చూడాలి.


Click it and Unblock the Notifications











