డిజాస్టర్ ఇచ్చిన హీరోతోనే మరో సినిమాకు సిద్దమైన రాశి ఖన్నా.. ఈసారైనా సక్సెస్ అవుతుందా?
హీరోయిన్స్ మధ్య పోటీ ఏ స్థాయిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పూజా హెగ్డే, రష్మిక మందన్న వంటి స్టార్ హీరోయిన్స్ గ్లామర్ డామినేషన్స్ ఎక్కువవ్వడంతో కొంతమంది పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఆ లిస్ట్ లో రాశి ఖన్నా కూడా ఉంది. ఈ బ్యూటీ చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికి ఇంకా స్టార్ హీరోలతో అవకాశాలు అందుకోలేకపోతోంది.
ఇంకా మిడియామ్ హీరోలతోనే సర్దుకుపోవాల్సి వస్తోంది. అయితే ఆ సినిమాలు కూడా పెద్దగా క్లిక్ అవ్వడకపోవడం ఈ బ్యూటీకి కాస్త ఇబ్బందిగా మారింది. మెయిన్ గా వరల్డ్ ఫేమస్ లవర్ ఒక రేంజ్ లో బెడిసికొట్టింది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. నెక్స్ట్ డిజాస్టర్ ఇచ్చిన హీరోతోనే మరో సినిమా చేయడానికి ఈ బ్యూటీ సిద్ధమవుతోంది.

రవితేజతో బెంగాల్ టైగర్ సినిమా చేసిన రాశి ఖన్నా అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. అందులో ఉన్న కాస్త పాజిటివ్ క్రెడిట్ కూడా తమన్నా కొట్టేసింది. ఇక ఇప్పుడు త్రినాధ్ రావ్ నక్కిన దర్శకత్వంలో రవితేజ చేయనున్న సినిమాలో రాశి మెయిన్ లో నటించే ఛాన్స్ ఉందట. ప్రస్తుతం క్రాక్ సినిమాతో బిజీగా ఉన్న మాస్ రాజా న్యూ ప్రాజెక్టును కూడా తొందరగానే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక రాశి ఖన్నా ఈ సినిమాతో అయినా మళ్ళీ తెలుగులో బిజీ అవుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











