త్రివిక్రమ్, తారక్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన యువ నిర్మాత.. త్వరలోనే బిగ్ న్యూస్!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇదివరకే అరవింద సమేత అంటూ తారక్ తో కలిసి వర్క్ చేసిన త్రివిక్రమ్ మరోసారి అంతకు మించిన సినిమాని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అల.. వైకుంఠపురములో సినిమాతో ఈ సీనియర్ డైరెక్టర్ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకోవడంతో తరువాత సినిమాపై అంచనాలు అకాశాన్ని దాటేస్తాయని చెప్పవచ్చు.
అసలు.మ్యాటర్ లోకి వస్తే.. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చి చాలా కాలమవుతోంది. సమ్మర్ లో షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు ఒక ఎనౌన్స్మెంట్ ఇచ్చిన తరువాత మళ్ళీ క్లారిటీ ఇవ్వలేదు. అసలు సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో అభిమానులలో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. ఇక ఆ డౌట్స్ పై యువ నిర్మాత నాగవంశీ ఒక క్లారిటీ ఇచ్చాడు.

'యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరి నుంచి కూడా సినిమాకు సంబంధించిన అప్డేట్ కావాలని మెస్సేజెస్ వస్తున్నాయి. అయితే షూటింగ్ ఎప్పుడైతే మొదలవుతుందో అపుడే పూర్తి వివరాలు తెలియజేస్తాము. దీనికి ముందు టైటిల్‌ను బహిర్గతం చేయకూడదనే సెంటిమెంట్ మాకు ఉంది. ఈసారి నమ్మండి. మీరు ఊహించిన దానికంటే అద్భుతమైన అప్డేట్ రానుంది' అంటూ నాగవంశీ వివరణ ఇచ్చారు.
ఇక ఈ సినిమాకు 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు మొదటి నుంచి చాలా రూమర్స్ వస్తున్నాయి. ఇక ఆ టైటిల్ ని మళ్ళీ మారుస్తున్నారు అనే టాక్ కూడా వచ్చింది. ఇక ఇప్పుడు నాగవంశీ వివరణ ఇవ్వడంతో అసలైన అప్డేట్ వచ్చేవరకు ఏ రూమర్ ని నమ్మకూడదని ఫ్యాన్స్ కి ఒక క్లారిటీ వచ్చింది. మరి ఆ స్పెషల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











