twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా డార్లింగ్‌కు బెస్టాఫ్ లక్.. ప్రభాస్.. చిన్న సినిమా కోసం మొన్న మహేష్.. నిన్న చిరంజీవి

    |

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల కాలంలో చిన్న సినిమాలను ప్రమోట్ చేయడంలో ముందుంటున్నారు. తాజాగా చిన్న సినిమాగా మొదలై భారీగా బజ్‌ను క్రియేట్ చేస్తున్న ఓ పిట్ట కథకు ప్రభాస్ చేయూతనందించారు. ఈ చిత్రం మార్చి 6వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించారు. ఈ సినిమా గురించి ట్వీట్ చేస్తూ ప్రభాస్ ఏమన్నారంటే..

    నా డార్లింగ్‌కు బెస్టాఫ్ లక్

    నా డార్లింగ్‌కు బెస్టాఫ్ లక్

    ఓ పిట్ట కథ సినిమా ద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేస్తున్న బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌కి నా బెస్ట్ విషెస్. అలాగే నా డార్లింగ్ బ్రహ్మాజీకి, భవ్య క్రియేషన్స్‌కు, చిత్ర యూనిట్‌కు కూడా ఆల్ ది బెస్ట్. మార్చి 6వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాను థియేటర్‌కు వెళ్లి ఆశీర్వదించండి అంటూ ప్రభాస్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఓ పిట్టకథ సినిమా ట్రైలర్‌ను కూడా షేర్ చేశారు.

    చిన్న సినిమాపై ప్రశంసలు

    చిన్న సినిమాపై ప్రశంసలు

    ఓ పిట్ట కథ మూవీ ద్వారా చెందు ముద్దు దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా స్క్రీన్ ప్లే గురించి ఇప్పటికే ఇండస్ట్రీలోని చంద్రశేఖర్ ఏలేటీ లాంటి ప్రముఖ దర్శకులు ఎంతో మంది అద్భుతంగా మాట్లాడుతున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

    సూపర్‌స్టార్ నుంచి మెగాస్టార్ వరకు

    సూపర్‌స్టార్ నుంచి మెగాస్టార్ వరకు

    ఇదిలా ఉండగా.. ఈ సినిమా టీజర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు ఆవిష్కరించి ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి వచ్చి బ్రహ్మాజీ కుమారుడిని, అలాగే చిత్ర యూనిట్‌కు ఆశీస్సులు అందించారు. సినీ పరిశ్రమలో ఉండే యువ హీరోలకు మార్గదర్శకం చూపేలా స్ఫూర్తి దాయకమైన ప్రసంగాన్ని చిరంజీవి చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

    Recommended Video

    Prabhas 21 Movie Update | Prabhas 21 Movie Concept
    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు..
    సాంకేతిక నిపుణులు:
    పాటలు: శ్రీజో ,
    ఆర్ట్: వివేక్‌ అన్నామలై,
    ఎడిటర్‌: డి.వెంకటప్రభు,
    కెమెరా: సునీల్‌ కుమార్‌ యన్‌.,
    సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు,
    ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అన్నే రవి,
    నిర్మాత: వి.ఆనంద ప్రసాద్‌.
    కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం : చెందుముద్దు

    English summary
    Prabhas Wishes O Pitta Katha team: Baahubali #Prabhas shared the teaser of #OPittaKatha & wished the entire team for their movie release which is on March 6th. Earlier, Mahesh Babu unveils O Pitta Katha Teaser: superstar appreciates film units.This movie directed by Chendu Muddu. Produced by V Ananda Prasad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X