Mad Trailer Review నైట్ ఆల్కాలిక్స్.. మార్నింగ్ వర్కాలిక్స్.. ఎన్టీఆర్ చేతుల మీదుగా మ్యాడ్ ట్రైలర్!
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన యూత్ ఫుల్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్ మ్యాడ్ మూవీ. ఈ చిత్రం పూర్తిగా యువ తారాగణంతో రూపొందింది. హారిక సూర్యదేవర ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ వినోదాత్మక చిత్రంలో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 6న విడుదల అవుతున్న నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా మ్యాడ్ (MAD) సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..
మ్యాడ్ సినిమా ట్రైలర్ చూస్తే.. యూత్ పుల్ ఎంటర్‌టైనర్‌గా స్పష్టంగా కనిపించింది. జీవితంపై అవగాహన లేని అల్లరి చిల్లరిగా తిరిగే యువకులు మాట్లాడే మాటలు ఫన్ క్రియేట్ చేశాయి. ఏపీలో నీళ్లు పోయలేదు అని ఒకరు అంటే.. రాత్రే పోసారని మరొకరు కామెంట్ చేయడం.. వారిద్దరి ఇది ఏసీరా అంటూ అమాయకత్వానికి జవాబిచ్చే విధంగా సీన్ కనిపించింది.

కాలేజీలో స్టూడెంట్స్, టీచింగ్ స్టాఫ్ మధ్య టీజర్ వ్యవహరాలు, కాలేజీ విద్యార్థులు అల్లరి పనులకు ఈ సినిమాలో పెద్ద పీట వేసినట్టు చెప్పారు. నోటికి ఇష్టం వచ్చినట్టు.. ఫిల్టర్లు లేకుండా యువకులు మాట్లాడుతూ నేటితరం ఓ వర్గం విద్యార్థులకు స్పూర్తిగా కనిపించారు.
మేము డీసెంట్ ఫ్యామిలీ అంటూ ఓ విద్యార్థి అంటే.. మీ నాన్న ఏం చేస్తారు టీచర్ అడిగితే.. మా నాన్న దొంగసారా కాస్తుంటాడని చెప్పడం.. ఈ సినిమాలో కామెడీకి ఎలా పెద్ద పీట వేశారనే విషయం స్ఫస్టమవుతుంది. యూత్‌కు కనెక్ట్ అయ్యేలా సున్నితమైన అడల్డ్ కంటెంట్ డైలాగ్ రూపంలో జొప్పించారనే విషయం కనిపించింది.
బ్రహ్మణ అబ్బాయికి కోడిగుడ్డు తినిపించడం లాంటి సీన్లు.. బట్టతల అతడిని దువ్వెన అడగడం లాంటి థర్డ్ క్లాస్ నాటు కామెడీతో జాతిరత్నాలను మరిపించే విధంగా కామెడీ ఉంది. ఇక ఓ పీఈటీ నా జాబ్ నన్ను చేయనివ్వండి అంటే.. నీదేం జాబ్.. పొద్దున్నుంచి నోట్ల పెట్టుకొని బ్లో చేయడమే పనిగా అంటూ అడల్డ్ డైలాగ్స్ చివర్లలో వినిపించాయి.
లాజిక్ లేకుండా, బుర్రపెట్టి ఆలోచించే విధంగా లేకుండా అప్పటికప్పుడు ఏది అనిపిస్తే అది అనేద్దాం అనే విధంగా డైలాగ్స్ కనిపించాయి. పక్కాగా కాలేజ్ బ్రాక్ డ్రాప్‌తో ఫన్‌తో సాగే సీన్లు తప్ప మరో విషయం ఉండదనే విధంగా యూత్‌కు నచ్చేలా ట్రైలర్‌ను డిజైన్ చేశారు. అక్టోబర్ 6వ తేదీన రిలీజ్ అయ్యే ఈ సినిమా మరో జాతిరత్నాలు మించిన సినిమా అవుతుందని నిర్మాత నాగవంశీ చెప్పిన జోస్యం ఫలిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











