నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. బాలయ్య సినిమా కోసం Jr ఎన్టీఆర్.. బోయపాటి బిగ్ సర్ ప్రైజ్
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోలకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చిన్న అప్డేట్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. అయితే బాలకృష్ణ - జూనియర్ ఎన్టీఆర్ లు ఒకటిగా కనిపిస్తే చూడాలని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇక బాలయ్య సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ కూడా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.

బాలయ్యతో సినిమా
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో RRR సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక బాలకృష్ణ, ఎన్టీఆర్ కూడా ఒక సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.

అప్పుడప్పుడు అలా..
ఇద్దరిలో ఎవరో ఒకరు కనీసం గెస్ట్ రోల్ అయినా కనిపిస్తే చూడాలని అనుకుంటున్నారు. చాలా కాలంగా ఈ కాంబినేషన్ పై అనేక రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి గాని ఏది కూడా నిజం కావడం లేదు. అయితే అప్పుడప్పుడు ఎదో ఒక సినిమా వేడుకతో మాత్రం బాబాయ్ తో ఎన్టీఆర్ దర్శనమిస్తున్నారు.

బాలయ్య సినిమా కోసం
ఇక చాలా కాలం తరువాత బాబాయ్ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రమోషన్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమా టైటిల్ పై ఇంతవరకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక ఆ టైటిల్ జూనియర్ ఎన్టీఆర్ ద్వారా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

ఉగాది సర్ ప్రైజ్
ఉగాది సందర్భంగా BB3 టైటిల్ ను రివీల్ చేయలేని చూస్తున్నారు. ఇక సినిమాపై అంచనాలు పెరగడంతో ఆ టైటిల్ ను జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేస్తేనే బావుంటుందని దర్శకుడు బోయపాటి సరికొత్త ప్లాన్ వేసినట్లు సమాచారం. ఉగాది రోజున సోషల్ మీడియా ద్వారా తారక్ బాలయ్యకు సంబంధించిన లుక్ తో పాటు టైటిల్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











