Chandoo Sai: "అందుకే అలాంటి కేసులు పెట్టి నా కడుపు మీద కొట్టారు.. అబ్బాయిలకు రక్షణ లేదు"!

యూట్యూబర్ చందు సాయి ఇటీవలే అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయనపై ఓ అమ్మాయి రేప్, 420 కేసులు పెట్టగా.. కొంతకాలం పాటు ఈయన జైల్లో ఉన్నాడుయ అయితే తాజాగా బయటకు వచ్చిన చందుసాయి.. తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన కేసుకు సంబంధించిన అనేక విషయాలు చెప్పుకొచ్చాడు. కావాలనే తనపై అలాంటి కేసులు పెట్టి తన కడుపు మీద కొట్టారని చెప్పుకొచ్చారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

యూట్యూబర్ చందు సాయి.. అంటే ఎవరికీ ఎక్కువగా తెలియకపోయినా పక్కింటి కుర్రాడు, చందూ గాడిగా అందరికీ సుపరిచితుడు. అయితే డిసెంబర్ 15వ తేదీన ఈయనను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ అమ్మాయి.. చందు తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తనపై అత్యాచారం కూడా చేశాడని అందులో పేర్కొంది. శారీరకంగా తనతో చాలా సార్లు కలిసిన అతడు.. పెళ్లి పేరు చెప్పగానే పారిపోయాడని తెలిపింది. ఇలా 420తో పాటు రేప్ కేసు కూడా పెట్టింది.

 Youtuber Chandoo Sai Shcoking Comments About His Case And Jail Life Check Details

ఇలా అరెస్ట్ అయిన చందు సాయిని.. పోలీస్ స్టేషన్ కు పిలిచి నేరుగా అరెస్ట్ చేశారు. అలా మొత్తం 27 రోజుల పాటు జైలు జీవితం గడిపాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన ఈయన తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. తాను ప్రేమలో ఉన్న విషయం వాస్తవమని.. అలాగే తామిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. కానీ వాళ్లే తన మీద కోపం పెట్టుకుని.. విపరీతమైన పగ పెంచుకుని తనపై కావాలని కేసులు పెట్టినట్లు తెలిపాడు. చేసినవి పెడితే ఓకే కానీ.. రేప్, 420 కేసులు మాత్రం బలంగా ఉండాలని పెట్టినట్లు వివరించాడు.

చివరి తీర్పు ఇంకా రాలేదని.. కానీ కచ్చితంగా తాను తప్పు చేయలేదు కాబట్టి బయటకు వస్తానని వివరించాడు చందుసాయి. కావాలనే కోపంతోనే తన కడుపు మీద కొట్టారని.. మొహం మీద కొడితే వారి కోపం తీరదమే కడుపు మీద కొట్టి.. తన పేరు అంతా పోగొట్టారని వెల్లడించాడు. కానీ తాను తప్పు చేయలేదని అందరికీ తెలిసే రోజు త్వరలోనే ఉంటుందని... ఈ కేసుల వల్ల తనకు ఓ మంచి సినిమాలో అవకాశం పోయిందని కూడా చందు సాయి స్పష్టం చేశాడు.

 Youtuber Chandoo Sai Shcoking Comments About His Case And Jail Life Check Details

కేవలం తనపై మాత్రమే కాకుండా తన తల్లిదండ్రులు, చెల్లెబావలపై కూడా కేసులు పెట్టారని చందుసాయి చెప్పాడు. తన చెల్లికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని.. ముఖ్యంగా ఆమె రెండో పాప 8 నెలలో పుట్టడం, 2 నెలలు బాక్సులో ఉంచడం.. ఆస్పత్రి నుంచి బయటకు రాగానే వారిపై ఇలా కేసులు పెట్టడం చాలా దారుణంగా అనిపించిందని... చెప్పాడు. తన సక్సెస్ తోనే వాళ్లకు కరెక్టుగా సమాధానం చెబుతానని చందుసాయి వివరించాడు. అబ్బాయిలకు ఈ లోకంలో రక్షణ లేదని.. తాను ఉన్న జైల్లోనే మొత్తం తన లాంటి కేసుతో వచ్చిన వాళ్లు 300 మందికి పైగా ఉన్నారని వివరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X