యాత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వైఎస్ జగన్.. కుటుంబం మొత్తం!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర చిత్రం తెరకెక్కుతోంది. ఫిబ్రవరి 7 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు వేగంగా నిర్వహిస్తోంది. నిన్ననే ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. రాజశేఖర్ రెడ్డి 2003లో రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పాదయాత్ర కీలక అంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఫిబ్రవరి 1న నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. వైజాగ్ లో ఈ వేడుకని ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. జగన్ తో పాటు వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వైఎస్ఆర్ పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. మహి వి రాఘవ్ ఈచిత్రానికి దర్శకుడు. ఈ చిత్ర నిర్మాత దేవి రెడ్డి జనవరి 9న జగన్ ని కలసి ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ పాదయాత్ర సందర్భంగా ప్రజలతో ఎలా మమేకమయ్యారు, ప్రజల సమస్యలు ఎలా తెలుసుకున్నారు అనే అంశాలు ఈ చిత్రంలో హైలైట్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











