జగనన్న బాహుబలి... భల్లాలదేవుళ్లు టచ్ చేయలేరు.. చంద్రబాబు, పవన్‌లపై రోజా ఘాటు వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ నెయ్యి, తిరుమల లడ్డూ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసుపై కూటమి ప్రభుత్వం సిట్‌తో విచారణ చేయిస్తుండగా... సీబీఐ తమ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిందంటూ మాజీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటూ ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వానికి, విపక్ష వైసీపీకి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇక ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు, మాజీ మంత్రులు జోగి రమేశ్, అంబటి రాంబాబుల బూతు పురాణం తీవ్ర కలకలం రేపింది.

చంద్రబాబుని అసభ్యపదజాలంతో దూషించడంతో టీడీపీ కేడర్ రెచ్చిపోయింది. అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై తెలుగుదేశం శ్రేణులు దాడి చేయడంతో పాటు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించింది. అటు ప్రభుత్వాధినేతపై దూషణలు చేసిన అభియోగాలపై అంబటి రాంబాబు, జోగి రమేష్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ పరిణామాలతో ఇప్పటి వరకు డల్‌గా ఉన్న వైసీపీ కేడర్ యాక్టీవ్ అయ్యింది. అంబటి, జోగిల ఇళ్లపై దాడులు చేయడంతో పాటు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు రోడ్డెక్కాయి.

YS Jagan Is Baahubali Rk Roja Slams AP CM Chandrababu Naidu and Dy CM Pawan Kalyan

ఇలాంటి పరిస్థితిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ రంగంలోకి దిగారు. శ్రేణులకు భరోసా కల్పించడానికి గాను గుంటూరులోని అంబటి నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. తాడేపల్లిలోని నివాసం నుంచి గుంటూరు వరకు భారీ కాన్వాయ్‌తో గుంటూరుకు చేరుకున్నారు జగన్. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదని, వచ్చేతి తమ ప్రభుత్వమేనని ఇలాంటి చర్యలతో భయపడమని జగన్ పేర్కొన్నారు. తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని కుట్రపూరితంగా తప్పుడు ప్రచారం చేయించారని జగన్ ఆరోపించారు.

మేం నిజంగా తప్పు చేసుంటే వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పేర్లను సీబీఐ తమ ఛార్జ్‌షీట్‌లో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. తనను అడ్డుకున్న టీడీపీ శ్రేణులతో అంబటి గొడవపడ్డారని.. సీఎం చంద్రబాబు నాయుడుని దూషించలేదని, ఇదే విషయాన్ని ప్రెస్‌మీట్‌లోనూ చెప్పారు. దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని... మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమేనని అప్పుడు ఒక్కోక్కరి అంతు తేలుస్తామని జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

తాజాగా ఏపీలో వైసీపీ నేతలపై దాడులు, అరెస్ట్‌లపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది.. పోలీసులు చూస్తుండగానే దాడులు జరుగుతున్నాయి. మాజీ మంత్రి ఇంటిపైనే దాడులకు తెగబడుతున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం గురించి చంద్రబాబు, పవన్ నీచంగా మాట్లాడారు. అలాంటి వాళ్లను వేంకటేశ్వరస్వామి మాత్రం క్షమించడు. తిరుమల లడ్డూలో ఎటువంటి జంతు కొవ్వు కలవలేదు, ఎలాంటి పంది కొవ్వు కలవలేదు, పంది కొవ్వు కలవలేదని సీబీఐ రిపోర్ట్‌లో పేర్కొంది.

నా గురించి టీడీపీ నేత బండరు సత్యనారాయణ మాట్లాడన మాటలు అన్నం తినేవాడు మాట్లాడతాడా? అలాంటి వ్యక్తిని ఏం చేయాలి? వాడి ఇంటిని ఏం చేయాలి? తెలుగుదేశం, జనసేనలో నీచాతి నీచంగా మాట్లాడతారు. జగన్ ఇంట్లో ఉంటే రా బయటకు అంటారు.. జగన్ బయటికి వస్తే మాత్రం ఇబ్బందులు సృష్టిస్తారు. పోలీసులు కనుక ఇలాగే అధికార పక్షానికి కొమ్ము కాస్తే భవిష్యత్తులో మీ అందరినీ కాపాడటానికి కూటమి ప్రభుత్వం ఉండదు. కూటమి ప్రభుత్వానికి కోర్టులంటే గౌరవం లేదు, వ్యవస్థలంటే గౌరవం లేదు.. సీబీఐ ఇచ్చిన రిపోర్ట్‌లో ఎక్కడా నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని చెబుతున్నాన కావాలని ఫ్లెక్సీలు వేసి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆ ఫ్లెక్సీలు తీసేయండి, ఇది కోర్టును ధిక్కరించడమేనని గౌరవంగా అంబటి రాంబాబు చెబితే వినకపోతే ఆయన మీదకే రాళ్లు, కర్రలతో వెళ్లి అంబటి దూషించారని రివర్స్‌లో కేసులు పెట్టారని రోజా ప్రశ్నించారు.

అరచేతితో సూర్యుడిని ఆపడం వీలవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే పోలీసులను పరుగులు పెట్టిస్తూ బారికేడ్డు పెట్టి చంద్రబాబు ప్రజలను ఆపుతున్నారు. భయపెట్టినా, పోలీసుల్ని భయపెట్టినా.. ప్రజలు ఆగకుండా రోడ్ల మీదకి వస్తున్నారు. జగనన్నని చూడటానికి, సంఘీభావం తెలియజేయడానికి వస్తున్నారంటే అర్ధమేంటీ? బాహుబలి సినిమా చూసుంటారు కదా? భల్లాలదేవుడు ఎన్ని కుట్రలు చేసి ఆ సింహాసనం మీద కూర్చున్నా ప్రజలు బాహుబలి వెనుకే ఉన్నారు. కాబట్టి ఈవీఎంలతో గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, డిప్యూటీ సీఎం, సీఎం గారు భయపెడితే.. భయపడే ప్రజలు ఏపీలో ఎవరూ లేరు. జగనన్న కోసం ప్రాణమిచ్చే వాళ్లు ఉన్నారు.. జగనన్న మంచోడు కాబట్టి ఈరోజ కూటమి ప్రభుత్వం మీద మేం దాడులు చేయడం లేదు. మాకు విలువలు ఉన్నాయి.. క్రమశిక్షణ ఉందని వాళ్లు తెలుసుకోవాలి అని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: ys jagan rk roja pawan kalyan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X