ఇదంజగత్ టీజర్ విడుదల.. వెరైటీ కాన్సెప్ట్‌తో అదరగొట్టేశారు!
హీరో సుమంత్ నటిస్తున్న తాజా చిత్రం ఇందంజగత్. ఈ చిత్ర టీజర్ కొద్దిసేపటిక్రితేమే వైసిపి అధినేత జగన్ చేతుల మీదుగా లాంచ్ అయింది. వైఎస్ జగన్, హీరో సుమంత్ స్కూల్ మేట్స్. తన స్నేహితుడి టీజర్ ని జగన్ లాంచ్ చేశారు. సరికొత్త కాన్సెప్ట్ తో ఇదంజగత్ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది.
టీజర్ లో సంభాషణ ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ మనిషి చావు న్యూసే, మనిషి జ్ఞాపకాలు న్యూసే.. ప్రేమ న్యూసే.. స్నేహమూ న్యూసే. అది ఎన్ క్యాష్ చేసుకోవడం తెలిసుండాలి.. అది నాకు తెలుసు. అంటూ టీజర్ లో మీడియా గురించి చూపించారు. సుమంత్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు సంభాషణలు బట్టి అర్థం అవుతోంది.
ప్రస్తుతం ఉన్న మీడియా వ్యవస్థపై సెటైరికల్ గా ఈ చిత్రాన్ని రూపొందించి ఉండవచ్చు. ఏది ఏమైనా ఇదం జగత్ టీజర్ మాత్రం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో సుమంత్, అంజు కురియన్ జంటగా నటిస్తున్నారు. అనిల్ శ్రీకాంతం దర్శకుడు.



Click it and Unblock the Notifications











