Posani Krishna Murali: ఆలీ తరువాత పోసానికి వైఎస్ జగన్ బంపరాఫర్.. కీలక బాధ్యతలు

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రాజకీయాల్లో కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా కొందరు ప్రముఖ సినీనటులు మద్దతు పలికిన విధానం అప్పట్లో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా కూడా చాలామంది కామెంట్ చేశారు. అయితే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను ఎక్కువగా టార్గెట్ చేసిన వారికి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంచి పదవులను ఇస్తున్నారు అనే విధంగా కామెంట్స్ అయితే వస్తున్నాయి. రీసెంట్ గా ఆలీకి ఒక ఆఫర్ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ ఇప్పుడు పోసానికి కృష్ణమురళీకి కూడా మంచి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

జగన్ కు మద్దతు ఇస్తూ..

జగన్ కు మద్దతు ఇస్తూ..

సినీ నటులుగా కొందరు మంచి గుర్తింపును అందుకున్న తర్వాత రాజకీయాల్లోకి వెళ్లేందుకు కూడా ఎంతో ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. కానీ అందరూ సక్సెస్ కాలేరు. ఇక మరికొందరు రాజకీయ నాయకుల సపోర్ట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో బాగా సపోర్ట్ చేసిన వారిలో కమెడియన్ ఆలీతో పాటు రైటర్ యాక్టర్ పోసాని కృష్ణమురళి కూడా ఉన్నాడు. ఎన్నికల్లో వారు ప్రచారాలు చేయడమే కాకుండా మీడియా ముందుకు వచ్చి పవన్ పై ఉహాలకందని స్థాయిలో విమర్శలు గుప్పించారు.

 పవన్ పై ఎక్కువ స్థాయిలో విమర్శలు

పవన్ పై ఎక్కువ స్థాయిలో విమర్శలు

ఒక విధంగా జగన్ సపోర్ట్ గా వెళ్లిన వారు ఆయనను పొగడడం కంటే కూడా పవన్ పై ఎక్కువగా విమర్శలు చేయడంతోనే ప్రత్యర్ధులు ఎక్కువ సమయాన్ని కేటాయించారనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే జగన్ మొదట టాలీవుడ్ నటి నటులను బాగా వాడుకున్నాడు అని ఆ తర్వాత వాళ్ళని గాలికి వదిలేశారు అనే విధంగా కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరొకవైపు తన హావాను పెంచుకుంటూ ఉన్న తరుణంలో మరోవైపు జగన్ గతంలో పవన్ కళ్యాణ్ పై ఊహించని విధంగా కామెంట్ చేసిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పదవులు ఇస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది.

అలీ రివర్స్

అలీ రివర్స్

ఒకప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడుగా కొనసాగిన కమెడియన్ ఆలీ ఎంత మంచి మిత్రుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ రాజకీయల కారణంగా అతను వైఎస్ జగన్ కు మద్దతు పలికి పవన్ కళ్యాణ్ పై కొంత విమర్శ కూడా చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక వైయస్ జగన్ ఇటీవల కమిడియన్ ఆలీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరపున ప్రధాన మీడియా సలహాదారుడిగా కీలక పదవిని అప్పగించిన విషయం తెలిసిందే.

పోసానికి బంపరాఫర్

పోసానికి బంపరాఫర్

ఇక ఇప్పుడు పోసాని కృష్ణమురళీకి కూడా మరొక కీలక బాధ్యతను అప్పగించినట్లుగా ఆదేశాలు జారీ అయ్యాయి. జగన్ కు వీరాభిమానిగా కొనసాగినటువంటి పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ పై చాలాసార్లు ఊహించని స్థాయిలో విమర్శలు చేశాడు. ఇక ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం తరపునుంచి మరొక కీలక బాధ్యతను అతనికి అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు మరి లిస్టులో ఉన్న మరి కొంతమంది సినీ నటులకు జగన్ ఎలాంటి పదవులు ఇస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X