Yatra 2 Teaser: తండ్రి పోయాడంటే కొడుకొచ్చాడు.. జగన్ రేంజ్ పెంచేలా యాత్ర 2 టీజర్

ఇండియా వ్యాప్తంగా ఉన్న అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లోనూ బయోపిక్ మూవీలు కుప్పలు కుప్పలుగా వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగులో కూడా ఈ తరహా సినిమాల సంఖ్య బాగా పెరుగుతోంది. అయితే, బయోపిక్‌లుగా వచ్చిన చిత్రాల్లో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. అలాంటి వాటిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో మహీ వీ రాఘవ్ తెరకెక్కించిన 'యాత్ర' ఒకటి.

రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత రూపొందిన సినిమానే 'యాత్ర'. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో దీనికి సీక్వెల్‌గా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కథతో సినిమా చేయాలని దర్శకుడు మహీ వీ రాఘవ్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకు తగ్గట్లుగానే స్టోరీని రెడీ చేసుకుని చాలా గ్యాప్ తర్వాత దీన్ని మొదలెట్టాడు.

YS Jaganmohan Reddy Biopic Yatra 2 Movie Teaser Released

'యాత్ర 2' పేరుతో రాబోతున్న ఈ సినిమాను ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే. కోలీవుడ్ హీరో జీవా ఇందులో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాత్రను చేస్తున్నాడు. ఒకవైపు షూటింగ్ శరవేగంగా జరుపుతూనే.. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేస్తున్నారు. వీటికి వైఎస్సార్ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.

2024లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం 'యాత్ర 2' మూవీని తీసుకు రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. ఆ తర్వాత ఈ సినిమా నుంచి మరిన్ని పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మూవీ అఫీషియల్ టీజర్‌ను వదిలారు.

ఓ ఎమోషలన్ సీన్‌తో 'యాత్ర 2' టీజర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత సోనియా గాంధీ, చంద్రబాబు పాత్రలు కుట్రలు చేసి జగన్‌ను జైలుకు పంపినట్లుగా చూపించారు. ఆ తర్వాత పార్టీని స్థాపించి పాదయాత్ర చేయడం.. అసెంబ్లీలో అడుగు పెట్టడం హైలైట్ చేశారు. మొత్తానికి ఈ టీజర్ మాత్రం జగన్ రేంజ్‌ను పెంచేలా కట్ చేశారు. ఇందులో బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఎంతో రిచ్‌గా ఉన్నాయి. ఫలితంగా ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

ఇదిలా ఉండగా.. 'యాత్ర 2' సినిమాను త్రి ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సీక్వెల్‌కు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రాజశేఖర్ రెడ్డిగా మమ్మట్టి, వైఎస్ భారతిగా కేతకీ నారాయన్ నటిస్తున్నారు. ఈ మూవీని 2024 ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X