Yatra 2: సీఎం జగన్ భార్యగా బాలీవుడ్ నటి.. మీ కళ్లను మీరే నమ్మలేనట్లుగా!
బయోపిక్ మూవీల ట్రెండ్ ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలోనే కనిపిస్తోంది. దాదాపు ఇండియాలోని చాలా భాషల్లోనూ ఈ తరహా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగులోని ఫిల్మ్ మేకర్లు సైతం బయోపిక్ మూవీలు చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. అలా కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు ప్రేక్షకులను అలరించిన సినిమానే 'యాత్ర'.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌గా వచ్చిన 'యాత్ర' చిత్రానికి విశేషమైన స్పందన లభించిన విషయం తెలిసిందే. దర్శకుడు మహి వీ రాఘవ్ ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకు అనుగుణంగానే ఇప్పటి ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి లైఫ్ స్టోరీతో దీనికి సీక్వెల్ చేయడానికి డైరెక్టర్ స్టోరీ రెడీ చేశాడు.

వైఎస్ జగన్ లైఫ్ స్టోరీపై మహీ వీ రాఘవ్ చాలా కాలం పాటు వర్క్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే కోలీవుడ్ హీరో జీవాతో ఈ సినిమాను 'యాత్ర 2' టైటిల్‌తో ప్రారంభించాడు. ఆ వెంటనే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను సైతం విడుదల చేశాడు. దీనికి వైఎస్ అభిమానులతో పాటు సినీ ప్రియుల నుంచి కూడా మంచి స్పందన లభించింది.
2024లో వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేస్తూ 'యాత్ర 2' మూవీని తీసుకు రాబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. అందరూ అనుకున్నట్లుగానే దీన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.
ఇదిలా ఉండగా.. 'యాత్ర 2' మూవీలో వైఎస్ భారతి పాత్రను బాలీవుడ్ నటి కేతకీ నారాయణ్ చేస్తోంది. తాజాగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె నిజంగా భారతిలాగే కనిపించింది. ఇక, ఈ పోస్టర్‌పై 'నిజమేనన్నా.. మా ఇంట్లో ఆడవాళ్లకు రాజకీయాలు, వ్యాపారాలు నేర్పించలేదు. అట్లాగే మాకు కష్టం, సమస్య వస్తే భయపడి వెనుదిరిగి చూడడం కూడా నేర్పించలేదు' అని డైలాగ్‌ను కూడా ఉంచారు. మొత్తానికి ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

ఇక, 'యాత్ర 2' సినిమాను త్రి ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సీక్వెల్‌కు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో మమ్ముట్టితో పాటు ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











