వైఎస్ఆర్ బయోపిక్ 'యాత్ర' రిలీజ్ డేట్ ఫిక్స్!
ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. వరుసగా బయోపిక్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఎన్టీఆర్ జీవిత చరిత్రగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ చిత్రం, వైఎస్ఆర్ జీవితచరిత్రగా తెరకెక్కుతున్న యాత్ర చిత్రాలు సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. యాత్ర చిత్రాన్ని మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తుండడం విశేషం.
ఈ చిత్ర విడుదల తేదీ విషయంలో చాలా రోజులుగా సందిగ్దత నెలకొంది. ఎట్టకేలకు చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తూ విడుదల తేదీ ప్రకటించారు. ఫిబ్రవరి 8న యాత్ర చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మొదట యాత్ర చిత్రాన్ని డిసెంబర్ లోనే విడుదల చేయాలని భావించారు. కానీ నిర్మాణపనులు పూర్తి కాకపోవడం, జనవరిలో భారీ చిత్రాల తాకిడి ఉండడంతో ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావించారు.

తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ చిత్రం విడుదల కానుండడం విశేషం. జగపతి బాబు, సుహాసిని, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తుండడం విశేషం. విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. వైఎస్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం రాజకీయంగా ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











