'యాత్ర' ఎమోషనల్ టీజర్: నేను విన్నాను.. నేనున్నాను.. వైఎస్ఆర్‌గా మమ్ముట్టి!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం యాత్ర. వైఎస్ఆర్ పాత్రలో మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి గెటప్‌లో మమ్ముట్టి ఒదిగిపోయి నటిస్తున్నాడు. మమ్ముట్టి వేషధారణ మొత్తం రాజశేఖర్ రెడ్డిని తలపించే విధంగా ఉంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ ఎమోషనల్ టీజర్ విడుదల చేసింది.
మమ్ముట్టి పాదయాత్ర చేస్తూ రైతుల సమస్యలని తెలుసుకుంటున్నారు. నీరు ఉంటే కరెంటు ఉండదు.. కరెంటు ఉంటే నీరు ఉండదు.. రెండు ఉండి పంట చేతికి వస్తే సరైన ధర ఉండదు. రైతులు రాజులుగా కాదు.. కనీసం రైతులుగా బ్రతకానిస్తే చలాలు అంటూ సాగే ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. వైఎస్ పాత్రలో ఉన్న మమ్ముట్టి.. నేను విన్నాను.. నేనున్నాను అంటూ డైలాగ్ చెబుతున్నాడు.

యాత్ర చిత్రాన్ని దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో జగపతి బాబు, అనసూయ, సుహాసిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. ఫిబ్రవరి 8న యాత్ర చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Click it and Unblock the Notifications











