‘యాత్ర 2’పై దర్శకుడి అప్డేట్: వైఎస్ రాజారెడ్డి, జగన్ లేకుండా పూర్తి కాదు!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంపై 'యాత్ర' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మహి వి రాఘవ్ త్వరలో 'యాత్ర 2' చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఈ సీక్వెల్ ప్రకటించారు.

తాజాగా ఈ సినిమా గురించి మహి వి రాఘవ్ ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. వైఎస్‌ రాజారెడ్డి, వైఎస్‌ జగన్‌ లేకుండా వైఎస్సార్‌ కథకు ముగింపు ఉండదని స్పష్టం చేశారు. 'యాత్ర 2' ఈ ముగ్గురి స్టోరీతో ముగుస్తుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

YSR’S story is incomplete without YS Raja reddy and YS Jagan: Mahi V Raghav

సీక్వెల్ తీసే ఉద్దేశ్యం ఇంతకు ముందే ఉందని, అందుకే 'యాత్ర' సినిమాను జగన్‌ ప్రస్తావనతోనే ముగించినట్లు మహి వి రాఘవ్ తెలిపారు. వైఎస్సార్‌ యాత్ర ఆయన తండ్రి సమాధి నుంచి మొదలైంది. జగన్‌ యాత్ర తన తండ్రి సమాధి నుంచి ప్రారంభమైందని ఈ సందర్భంగా దర్శకుడు గుర్తు చేశారు. ఇదే 'యాత్ర 2'లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

జగన్ పాదయాత్ర మొదలు... 2019లో అతడు అధికారంలోకి వచ్చే వరకు చోటు చేసుకున్న పరిణామాలను ఫోకస్ చేస్తూ 'యాత్ర 2' ఉంటుందని టాక్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 175 సీట్లకుగాను 151 సీట్లతో వైసీపీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే.

YSR’S story is incomplete without YS Raja reddy and YS Jagan: Mahi V Raghav

అయితే 'యాత్ర 2' ఎప్పుడు వస్తుందనే విషయాలను మాత్రం మహి వి రాఘవ్ తెలుపలేదు. 'యాత్రా 2' స్టోరీ రాయడం ప్రారంభిస్తాను, త్వరలోనే సినిమా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను అనే ప్రకటన మాత్రమే చేశారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X