నన్ను ముద్దు అడగలేదు.. వైసీపీ నేత యాంకర్ శ్యామల కామెంట్.. నెటిజన్ల ట్రోలింగ్

యాంకర్ శ్యామలకు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించినట్లుగానే వార్తలు వస్తున్నాయి. జగన్ ఆదేశాలు ఇచ్చారో లేదో అప్పుడే టీడీపీపై మాటల దాడి ప్రారంభించింది శ్యామల. అయితే రాజకీయాలు, రాజకీయ వాతావరణం ఆమెకు పూర్తిగా కొత్త.. ఇక్కడ కౌంటర్లకు రీ కౌంటర్లు ఉంటాయి. అందుకు తగినట్లుగానే శ్యామలపై దాడి మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే..

చిన్నాచితకా ఈవెంట్లు చేస్తూ స్టార్ యాంకర్‌గా స్థానం సంపాదించుకున్నారు శ్యామల. క్లీవేజ్ షోకు దూరంగా , పొట్టి బట్టలు వేయకుండా కేవలం సాంప్రదాయ బట్టల్లోనే అందంగా కనిపించేవారు. పెళ్లయి, ఓ బిడ్డకు తల్లయినా శ్యామలలో ఏ మత్రం వన్నెతగ్గలేదు. తన భర్త నరసింహారెడ్డి కుటుంబం వైఎస్ కుటుంబానికి గట్టి మద్ధతుదారు కావడంతో ఆమె కూడా వారి అడుగుజాడల్లోనే నడిచారు. గతంలో జగన్, షర్మిల పాదయాత్రలలో నరసింహారెడ్డి, శ్యామల కనిపించిన సంగతి తెలిసిందే.

ysrcp leader anchor Syamala gets trolled by netizens over her comments on kiss here s the details

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు సినీ పరిశ్రమకు గట్టి వాయిస్‌గా నిలబడిన అతికొద్దిమందిలో యాంకర్ శ్యామల ఒకరు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. తన వాగ్ధాటి, వాడివేడి విమర్శలతో వైసీపీ జనాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లపై శ్యామల చేసిన విమర్శలు దుమారం రేపాయి. ప్రస్తుతం ఏపీలో టీడీపీ - జనసేన- బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో ఈ స్టార్ సైలెంట్ అయ్యారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని, చాలా భయమెస్తోందని తనను బతకనీయండి అన్నా అంటూ శ్యామల ఓ వీడియో రిలీజ్ చేశారు.

మరోవైపు.. ఏపీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీ ప్రక్షాళనపై దృష్టిపెట్టిన వైఎస్ జగన్ .. పార్టీ కమిటీలు, అనుబంధ సంఘాల కార్యవర్గాలను మారుస్తున్నారు. దీనిలో భాగంగా కొత్తగా నలుగురిని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించారు. వారే భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావు, ఆర్కే రోజా, యాంకర్ శ్యామల. ఇలా పదవి దక్కిందో లేదో వెంటనే యాక్షన్‌లోకి దిగిపోయారు శ్యామల. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 2 ఎకరాల నుంచి రూ.2 లక్షల కోట్లకు పైగా సంపాదించుకున్న చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎంతమందికి సాయపడ్డారని శ్యామల ప్రశ్నించారు.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి యాంకర్ శ్యామల రావడం.. సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడంతో టీడీపీ సోషల్ మీడియా జనాలు యాక్షన్‌లోకి దిగారు. శ్యామలపై అప్పుడే ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఆమె ఓ షోకి యాంకరింగ్ చేసిన పాత వీడియో ఒకటి తెరపైకి వచ్చింది. ఎప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్‌ని కిస్ చేయాలని అనిపిస్తే ఎలా అడుగుతారని ఓ వ్యక్తిని ప్రశ్నిస్తుంది శ్యామల. దీనికి ఆ వ్యక్తి డైరెక్ట్‌గానే అడుగుతానని తేల్చిచెబుతాడు.. సిగ్గు , భయం, మొహమాటం అన్ని పోయాయని ఆమె కామెంట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. బహుశా తనను ముద్దు అడగలేదని శ్యామల ఫీలౌతోందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి దీనికి ఆమె ఎలాంటి కౌంటరిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X