విజయ్ పార్టీలోకి ఆర్కే రోజా?.. ఆఫర్‌ ఇదే, వైసీపీ ఫైర్ బ్రాండ్ షాకింగ్ డెసిషన్

ఒకప్పుడు సౌతిండియాలో తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు రోజా. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకపోయినా తన కృషి, పట్టుదలతో ఈ స్థాయికి చేరుకున్నారు. సౌత్‌లోని అందరు స్టార్ హీరోలతో నటించి శెభాష్ అనిపించుకున్నారు. కెరీర్ పీక్స్‌లో ఉన్న దశలోనే దర్శకుడు ఆర్కే సెల్వమణితో ప్రేమలో పడి సుదీర్ఘకాలం డేటింగ్ తర్వాత ఇద్దరు ఒక్కటయ్యారు. రాజకీయాలపై తొలి నుంచి ఆసక్తి ఉండటంతో తెలుగుదేశం పార్టీలో చేరారు.

చంద్రబాబు నాయుడు తదితర టీడీపీ పెద్దల ప్రోత్సాహంతో ఆ పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగానూ పనిచేసి ఎన్నో ప్రజా పోరాటాలు చేశారు. 2009లో టీడీపీ అభ్యర్ధిగా చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన రోజా.. తర్వాతి కాలంలో తెలుగుదేశానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరాలనుకున్నారు. అయితే నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణంతో కాంగ్రెస్‌లో పరిస్థితుల దృష్ట్యా ఆమె తన ఆలోచన విరమించుకున్నారు. అనంతరం వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీలో చేరారు.

ysrcp leader rk roja reacts fake news on Joining In Vijay Thalapathy s Party Tamilaga Vettri Kazhagam

ఫైర్‌బ్రాండ్‌గా దూకుడుగా ఉండే ఆమెను జగన్ బాగా ప్రొత్సహించారు. ప్రత్యర్ధులపై వాడి వేడి విమర్శలు చేయడంలో రోజా ఎప్పుడూ ముందుంటారు. 2014లో నగరి నుంచి గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు రోజా. అప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉండటంతో జగన్ ఆదేశాల మేరకు ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశారు. 2019 ఎన్నికల్లో నగరి నుంచి మరోసారి విజయం సాధించారు.

ఆ ఎన్నికల్లో వైసీపీ సైతం అధికారంలోకి రావడంతో ఆమెను ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా నియమించారు జగన్. అనంతర కాలంలో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రోజాకు పర్యాటక, యువజన వ్యవహారాల శాఖను అప్పగించారు జగన్. అయితే 2024 ఎన్నికల్లో రోజా ఓటమి పాలవ్వడంతో పాటు హ్యాట్రిక్ సాధించాలన్న ఆమె కలలు కల్లలయ్యాయి. ఓటమి తర్వాత ఎక్కువగా ఇంటికే పరిమితమవుతున్న రోజా.. ఇటీవల మళ్లీ యాక్టీవ్ అవుతున్నారు.

అయితే కూటమి ప్రభుత్వం దెబ్బకు రోజా.. ఏపీ రాజకీయాలకు గుడ్ బై చెప్పి తమిళనాడు పొలిటిక్స్‌లో ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగింది. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ స్థాపించిన పార్టీలో ఆమె చేరుతారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా స్పందించారు. దివంగత జయలలిత తనను అన్నాడీఎంకేలో జాయిన్ అవ్వమని స్వయంగా అడిగారని కానీ ఏపీకి ఏదో చేయాలనే ఉద్దేశంతో తిరస్కరించానని రోజా తెలిపారు. తాను ఎట్టి పరిస్ధితుల్లోనూ ఆంధ్రప్రదేశ్‌ను వదిలి వెళ్లేది లేదని ఆమె తేల్చిచెప్పారు. ఇక ఇళయ దళపతి పార్టీపై గురించి రోజా మాట్లాడుతూ.. విజయ్‌కి యూత్‌లో మంచి క్రేజ్ ఉందన్నారు. కానీ ఆయన సీఎం అవుతారో లేదో చెప్పలేమంటూ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: ys jagan rk roja vijay joseph
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X