Pushpa 2 : వైసీపీ నేతతో కలిసి పుష్ప 2 చూసిన బన్నీ .. నాగబాబు రియాక్షన్ ఏంటో?
అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ది రూల్. మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప ది రైజ్‌కి సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. రష్మిక మందన్న, ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతిబాబు, రావు రమేష్‌లు ఇతర కీలకపాత్రలు పోషించారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12000 స్క్రీన్‌లలో పుష్ప 2ని రిలీజ్ చేశారు.
కాగా.. డిసెంబర్ 4 అర్ధరాత్రి నుంచే ఓవర్సీస్‌లో ప్రీమియర్స్, ఇండియాలో కొన్ని ఎంపిక చేసిన థియేటర్స్‌లో స్పెషల్ షోలను ప్రదర్శించారు . దీంతో సోషల్ మీడియా అంతా పుష్ప మేనియా కనిపిస్తోంది. థియేటర్ నుంచి పుష్పకి సంబంధించిన అప్‌డేట్స్‌ని తమ ఆత్మీయులు, ఫ్రెండ్స్‌తో పంచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు . వాట్సాప్ డీపీలన్నీ పుష్ప పోస్టర్స్‌తో నిండిపోయాయి. ఇక బన్నీ ఫ్యాన్స్ అయితే బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను పుష్ప 2 బద్దలు కొడుతుందని బల్లగుద్ధి చెబుతున్నారు.

ఇదిలాఉండగా.. ఆగస్ట్ 15న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా నాలుగు నెలలు ఆలస్యంగా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని వెనుక చాలా కారణాలు తెరపైకి వచ్చినప్పటికీ.. ప్రధానంగా మెగా, పవన్ అభిమానుల వల్లే పుష్ప 2 పోస్ట్‌పోన్ అయ్యిందని ఫిలింనగర్‌లో కథకథలుగా చెప్పుకుంటున్నారు. దీనికి కారణంగా అల్లు అర్జునే. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సొంత మేనమామ , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కష్టపడుతుంటే బన్నీ మాత్రం పవన్‌కు, చంద్రబాబుకు బద్ధ శత్రువైన వైఎస్ జగన్ పార్టీకి చెందిన వ్యక్తికి అల్లు అర్జున్ మద్ధతు తెలిపాడు.
దీంతో మెగా ఫ్యాన్స్, పవన్ అభిమానులు భగ్గుమన్నారు. నాటి నుంచి వారు అల్లు అర్జున్‌ను మెగా కాంపౌండ్‌లో వ్యక్తిగా గుర్తించడం లేదు . దీనికి నాగబాబు ట్వీట్ మరింత ఆజ్యం పోసింది. చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్ తర్వాత అల్లు అర్జున్ నటించిన ఓ సినిమా పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. దీనికి భయపడిన పుష్ప 2 మేకర్స్ సినిమాను వాయిదా వేశారని డిస్కషన్ నడిచింది. ఈ వివాదం ఇలా కంటిన్యూ అవుతున్న దశలోనే పుష్ప 2 థియేటర్‌లలో దిగింది.

ఈ సినిమాను హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో అల్లు అర్జున్ తన ప్రాణ మిత్రుడు , వైసీపీ నేత శిల్పా రవిచంద్రారెడ్డితో కలిసి వీక్షించారు. అనంతరం బయట మీడియాతో మాట్లాడిన శిల్పా రవి.. సినిమా చాలా బాగుందని , జాతర సీక్వెన్స్ బాగుందని తెలిపారు. కలెక్షన్ల విషయంలో ఇండస్ట్రీలోనూ తిరుగులేని రికార్డ్ నెలకొల్పుతుందని శిల్పా రవి ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మెగా ఫ్యాన్స్ ముఖ్యంగా నాగబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. పుష్ప 2 విడుదలకు ముందు కూడా ఏదో మొక్కుబడిగా ట్వీట్ చేసిన నాగబాబు.. ఇప్పుడు శిల్పారవితో అల్లు అర్జున్ సినిమా చూడటంపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











