Bheemla Nayak: జగన్ గారు మంచే చేశారు.. ఫ్లెక్సీలు చించేసిన ఫ్యాన్స్ కు చెబుతున్నా..: రోజా కౌంటర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన అనంతరం కొన్నిసార్లు రాజకీయాల ప్రభావం సినిమాల పైన కూడా పడుతోంది. ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ సినిమాతో ఆ విషయం చాలా బాగా అర్థం అయినట్టుగా పలువురు రాజకీయ ప్రముఖులు వివరణ ఇచ్చారు జనసేన సైనికులు కూడా ఆ విషయంలో జగన్ సర్కార్ పై చాలా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ పై తమకు ఎలాంటి కక్ష లేదు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక సినీ నటి వైఎస్ఆర్సీపీ నగరి ఎమ్మెల్యే రోజా కూడా వివాదం పై స్పందింసీగారు. ఆ వివరాల్లోకి వెళితే..

మంచే చేశారు

మంచే చేశారు

రోజా మాట్లాడుతూ.. ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ సంబంధించిన గొడవల గురించి అందరూ చూస్తూనే ఉన్నారు. ఎదో తాము పవన్ కళ్యాణ్ గారిని కావాలని తొక్కేయటం కోసమే ఇలా చేస్తున్నాము అని ఆరోపించడం చాలా బాధాకరం. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒకటి గమనించాలి. తెలంగాణలో టిక్కెట్ రేటు 350 అయితే ఆంధ్రప్రదేశ్ లో 150 రూపాయలు. దీన్ని బట్టి జగన్ గారే అందరికి మంచి చేశారని చెప్పుకోవాలి.. అని రోజా అన్నారు.

తొక్కేయడానికి ఆయన ప్రొడ్యూసరా?

తొక్కేయడానికి ఆయన ప్రొడ్యూసరా?

ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని సినిమా పరంగా తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు. అసలు అలా తొక్కేయడానికి ఆయన ప్రొడ్యూసరా లేక డిస్ట్రిబ్యూటరా అనేది నాకైతే అర్థం కావడం లేదు. అఖండ, పుష్ప సినిమాలకు ఎలాంటి రేట్లు అయితే ఉన్నాయో అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమాకు కూడా ఒకే తరహా రేట్లు ఉన్నాయని ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి.. అని రోజా తెలిపారు.

ఫ్లెక్సీలు కూడా చించేశారని తెలిసింది..

ఫ్లెక్సీలు కూడా చించేశారని తెలిసింది..

మా నియోజకవర్గంలో కొందరు మా ఫ్లెక్సీలు కూడా చించేశారని తెలిసింది. నేను అప్పటి నుంచి ఫ్యాన్స్ కు ఈ విషయం చెప్పాలని అనుకుకుంటున్నాను. ఇటీవల చిరంజీవి గారు ప్రభాస్ మహేష్ ఇలా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. ఇక వారు చెప్పినట్లు హై కోర్టు నిర్ణయం ప్రకారం కమిటీ వేసి చర్చించడం జరుగుతోంది. ఇక ఫైనల్ గా 21వ తేదీన చర్చలు ఒక కొలిక్కి వచ్చే దశలో మంత్రి గౌతమ్ రెడ్డి మృతి చెందడం వలన మీటింగ్ క్యాన్సిల్ అయ్యింది. మరో నాలుగు రోజులు ఆలస్యం అవుతుండవచ్చు.. అంతే గాని ఎవరికి అన్యాయం చేయలేదు.

అప్లికేషన్లు పెట్టుకోవాల్సింది..

అప్లికేషన్లు పెట్టుకోవాల్సింది..

ఇక అందరూ కూడా మార్చిలో సినిమాలను వాయిదా వేసుకున్నారు. లేదంటే హైకోర్టు చెప్పినట్లుగా టికెట్ల రేట్లు పెరగాలి అంటే ప్రతీ జిల్లాలోని జాయింట్ కలెక్టర్ కు అప్లికేషన్లు పెట్టుకోవాల్సింది. కానీ అలా చేయకుండా సినిమాతో రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. ఫ్యాన్స్ కూడా గమనించాలి. జగన్ గారు ప్రస్తుతం ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా కూడా ప్రత్యేకంగా పిలిపించి చర్చించి అందరికి సముఖంగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ మూడేళ్ళ పాలనలో ఆ విషయం అర్థమైంది. కాబట్టి ప్రతీ దాన్ని రాజకీయం చేయడం మానేస్తే బావుంటుంది.. అని రోజా వివరణ ఇచ్చారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X