NTR Fan Death Mystery వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు?.. ఎంపీ రఘురామకృష్ణ రాజు సెన్సేషనల్ ట్వీట్
అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ వ్యవహారం అత్యంత వివాదాస్పదంగా మారుతున్నది. శ్యామ్ మరణం వెనుక అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు చెందిన నేతలు ఉన్నారనే ఆరోపణలు సోషల్ మీడియాలో వస్తుండటంతో శ్యామ్ డెత్ మిస్టరీగా మారింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష నేతలు, పార్టీలు ఘాటుగా ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ రఘురామకృష్ణ రాజు (RRR) చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. RRR చేసిన ట్వీట్ వ్యవహారంలోకి వెళితే..
ఎన్టీఆర్ అభిమాని ఉరి వేసుకొని మరణించారనే విషయం వెలుగులోకి వచ్చినప్పటికీ.. ఆయన భౌతికకాయాన్ని చూస్తే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నోట్ల గంజాయి కుక్కిన తీరు, ఉరి వేసుకొన్న తర్వాత కాలు నేలపై ఉండటం, శరీరంపై అనేక గాయాలు కనిపించడంతో శ్యామ్ మరణం మిస్టరీగా మారింది.

తూర్పు గోదావరి జిల్లాలోని చింతలూరు గ్రామానికి చెందిన ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ విషాదకర మరణం అత్యంత బాధాకరం.శ్యామ్ మరణంతో విషాదంలో మునిగిపోయిన ప్రతీ ఒక్కరికి, కుటుంబ సభ్యులుకు, స్నేహితులకు నా ప్రగాఢ సంతాపం. శ్యామ్ డెత్ మిస్టరీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలకు ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ మిస్టరీ డెత్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించాలని నేను డిమాండ్ చేస్తున్నాను అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ రెబల్ ఎంపీ కే రఘురామకృష్ణ రాజు ట్వీట్ చేశారు.

ఎన్టీఆర్ అభిమాని మృతిపై స్పందిస్తూ ఎంపీ కే రఘురామకృష్ణ రాజు చేసిన ట్వీట్‌పై సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ కనిపిస్తున్నది. మిస్టరీ డెత్‌పై స్పందించినందుకు థ్యాంక్స్ అంటూ నెటిజన్లు, ఎన్టీఆర్ అభిమానులు స్పందిస్తున్నారు. ఏపీలో ప్రతీ రోజు ఇలాంటి అనుమానాస్పద మరణాలు సంభవిస్తున్నాయి అంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. ఇలాంటి వాటిపై స్పందించినందుకు ధన్యవాదాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
శ్యామ్ మృతి వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సోమవారం నుంచి #WeWantJusticeForShyamNTR అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది. తాజాగా టీడీపీ అగ్ర నేతలు చంద్రబాబు, నారా లోకేష్ స్పందించడంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకొన్నది. పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ ఇంకా స్పందించకపోవడం ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











