Who is Yudhvir Ahlawat? షారుఖ్, ఎన్టీఆర్, విజయ్‌లు వెనక్కి.. ఆ లిస్ట్‌లో నెంబర్‌వన్‌గా, ఎవరీ యుధ్‌వీర్?

సినీ పరిశ్రమలో స్టార్ డమ్, రికార్డులు అన్నీ నెంబర్ గేమ్సే. ఎప్పుడు ఎవరు టాప్‌లో ఉంటారో? ఎవరు పాతాళానికి పడిపోతారో ఊహించడం కూడా కష్టం. శుక్రవారం నుంచి శుక్రవారం వరకు మధ్య గ్యాప్‌లో ఏమైనా జరగొచ్చు. పాపులారిటీ కూడా అంతే. మనదేశంలో నటీనటుల పాపులారిటీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. సినిమాలు, కలెక్షన్స్, మరెన్నో లెక్కల ఆధారంగా పాపులారిటీలో మార్పులు చోటు చేసుకుంటాయి. రాత్రికి రాత్రే అగ్రస్థానానికి చేరుకున్న నటులు ఉన్నారు.. అడ్రస్ లేకుండా పోయిన వారు కూడా ఉన్నారు. తాజాగా ఓ యువ నటుడు.. ఏకంగా అగ్రహీరోలను వెనక్కి నెట్టి పాపులారిటీలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ వివరాల్లోకి వెళితే..

భారతదేశంలో సినిమాలు, సినీతారలు, ఇతర వివరాలను అందించే పాపులర్ వెబ్ పోర్టల్ ఐఎండీబీ.. ప్రతివారం పలు కేటగిరీలలో ర్యాంక్‌లను ప్రకటిస్తూ ఉంటుంది. పాపులర్ స్టార్స్, పాపులర్ సినిమాలు అంటూ ఇవి చాలానే ఉన్నాయి. తాజాగా ఐఎండీబీ ఇండియా .. మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల విక్లీ జాబితాను విడుదల చేసింది. ఇందులో షారుఖ్ ఖాన్, ఐశ్వర్యరాయ్, దళపతి విజయ్, ప్రభాస్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారిని వెనక్కి నెట్టి నెంబర్ వన్‌గా నిలిచాడు యుధ్ వీర్ అహ్లావత్. దీంతో ఈ కుర్రాడు వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. దాంతో ఈ అబ్బాయి ఎవరు? అగ్రనటులనే వెనక్కి నెట్టేంతగా ఏం చేశాడు? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Yudhveer Ahlawat Beats Shah Rukh Khan Prabhas in IMDb Popularity Rankings

ఎవరీ యుధ్‌వీర్ అహ్లావత్?
హర్యానాలోని షేరియా గ్రామంలో 5 సెప్టెంబర్ 1992న జన్మించాడు యుధ్‌వీర్. ఆయన తండ్రి ఛౌదరి జ్ఞాన్ సింగ్ అహ్లావత్ బీఎస్ఎఫ్‌లో పనిచేశారు. తల్లి వేద్‌కౌర్ అహ్లావత్ గృహిణి. రోహతక్‌లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో పీజీ చదువుకున్న యుధ్‌వీర్.. ఆ తర్వాత నటన వైపు అడుగులు వేశాడు. 2017లో ఛక్రధారి అజయ్ కృష్ణ అనే సీరియల్‌లో చిన్న పాత్రలో మెరిసిన యుధ్‌వీర్.. ఆ తర్వాత 2019లో సాంద్ కి ఆంఖ్ అనే సినిమాలో బాలనటుడిగా కనిపించాడు.

అనంతరం లవ్ హోస్టల్, కో ఎడ్ వంటి వెబ్ సిరీస్‌లతో సత్తా చాటుతూ వస్తున్నాడు. ఈ దశలో పుల్కిత్ దర్శకత్వం వహించగా.. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన కర్తవ్య చిత్రంలో యుధ్‌వీర్ ప్రశంసలు దక్కించుకున్నాడు. పరిస్ధితుల కారణంగా కిరాయి హంతకుడిగా మారే హర్పాల్ అనే కుర్రాడిగా యుధ్‌వీర్ ఒదిగిపోయాడు. అతని నటన, భావోద్వేగాలు యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యాయి. కర్తవ్య మూవీ విజయంతో యుధ్‌వీర్‌కు అభిమానులు, ఫాలోవర్స్ బాగా పెరిగారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్‌ వరల్డ్ వైడ్‌గా మంచి ఫాలోయింగ్‌ను, యూజర్స్‌ను సంపాదించుకుంది.

ఈ నేపథ్యంలో ఈ వారం ఐఎండీబీ ఇండియా విడుదల చేసిన మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాలో యుధ్‌వీర్ అగ్రస్థానంలో నిలిచాడు. అది కూడా సూపర్‌స్టార్స్‌ని వెనక్కి నెట్టి కావడం గమనార్హం. అయితే చిన్న వయసు పాత్రలు, కుర్రాడిగా కనిపిస్తున్నానని తాను మైనర్‌ని కాదని యుధ్‌వీర్ పలు ఇంటర్వ్యూలలో వెల్లడించాడు. ఇకపోతే.. ఈ ఐఎండీబీ లిస్ట్‌లో ఐశ్వర్యరాయ్ 3వ స్థానంలో.. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ 4వ స్థానంలో, టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ 24వ స్థానంలో, షారుఖ్ ఖాన్ 30వ స్థానంలో నిలిచారు.

Read more about: shah rukh khan prabhas imdb
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X