Yuvraj Singh's Biopic: భారీ బడ్జెట్‌తో యువరాజ్ సింగ్ బయోపిక్.. వర్కవుట్ అవుతుందా?

భారతీయ సినిమా రంగంలో స్పోర్ట్స్‌ బ్యాక్ డ్రాప్‌తో వచ్చిన బయోపిక్స్ పెద్దగా వర్కవుట్ అవ్వలేదనే విషయం అందరికి తెలిసిందే. కేవలం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ఎంఎస్ ధోని బయోపిక్ మాత్రమే భారీ కలెక్షన్లు సాధించి బ్లక్ బస్టర్‌గా నిలిచింది. అయితే అజారుద్దీన్, సచిన్, కపిల్ దేవ్, మేరి కోమ్ తదితర చిత్రాలు అంతగా మెప్పించలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో యువరాజ్ సింగ్ బయోపిక్ తెరపైకి వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? నిర్మాతలు ఎవరు అనే వివరాల్లోకి వెళితే..

యువరాజ్ సింగ్ అంటే ఇండియన్ క్రికెట్ టీమ్‌లో డాషింగ్ క్రికెటర్‌గా, యాంగ్రీ యంగ్ మ్యాన్‌ సుపరితులు. మైదానంలోనే కాకుండా వ్యక్తిగతంగా దూకుడు స్వభావంతో కనిపించే వాడు. అయితే ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్దమయ్యేవాడనే విషయం పలు సందర్భాల్లో స్పష్టమైంది. అలాంటి దేశభక్తుడి లాంటి క్రికెట్ జీవితం తెరపైకి రానున్నది.

Yuvraj Singh s Biopic Here is the budget details

యువరాజ్ అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు.. ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు కూడా ఉన్నాయి. వరల్డ్ కప్ మ్యాచుల సందర్భంగా అనారోగ్యాన్ని లెక్క చేయకుండా దేశం కోసం ఆడాడు. క్యాన్సర్ వ్యాధికి గురై గ్రౌండ్‌లో రక్తపు వాంతులు చేసుకొంటూ కూడా ఇండియాను గెలిపించే ప్రయత్నం చేశారు.

యువరాజ్ అంటే టీ20 ఫార్మాట్‌లో ఓకే ఓవర్‌లో ఆరు బంతులను ఆరు సిక్సర్లుగా మలిచిన ఘనత ఆయనకే చెందింది. స్టైలిష్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌గా భారత్‌కు మరుపురాని విజయాలు అందించారు. వ్యక్తిగతంగా కూడా ఎంతో కీర్తిని సంపాదించుకొన్నాడు. ఆయన జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. వాటిని తెరకెక్కించేందుకు టీ సీరిస్ అధినేత భూషణ్ కుమార్ సిద్దమయ్యారు.

Yuvraj Singh s Biopic Here is the budget details

అయితే యువరాజ్ బయోపిక్‌ను భారీగా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా.. స్క్రిప్టును సిద్దం చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టును నిర్మాతలు ప్రతిష్టాత్మంగా తీసుకొనన్నట్టు తెలుస్తున్నది. ఈ చిత్రాన్ని సుమారుగా 200 కోట్ల రూపాయలతో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా లాంటి దేశాలతో పాటు భారత్‌లోని పలు స్టేడియాల్లో షూట్ చేస్తారని తెలిసింది.

అయితే ఇంకా యువరాజ్ బయోపిక్ చర్చల దశలోనే ఉంది. ఇంకా రణ్‌బీర్ కపూర్ తప్పా మరొకరి ఎంపిక జరుగలేదు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణలు పేర్లను వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలిసింది. యువరాజ్ జీవితంలో బయటకు రాని ఎన్నో విషయాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయని చెబుతున్నారు. అయితే బయోపిక్ విషయంలో ఫ్లాపులను ఈ సినిమా అధిగమిస్తుందని పేర్కొన్నారు.

More from Filmibeat

Read more about: yuvraj singh bhushan kumar biopic
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X