స్టార్ హీరోయిన్ పై టీమిండియా క్రికెటర్ పరువు నష్టం దావా!.అవన్నీ అబద్ధాలేనా?

టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal)మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆయన క్రికెట్ రికార్డుల వల్ల కాదు.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వ్యక్తిగత వివాదం కారణంగా హాట్ టాపిక్‌గా మారారు. నటి, మోడల్ తాన్యా ఛటర్జీ (Taniya Chatterjee) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. చహల్ తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో "క్యూట్" అంటూ మెసేజ్ చేశాడని ఆమె చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలను చహల్ సీరియర్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో తనపై పరువు నష్టం దావా వేశారని తానియా వెల్లడించడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.

ఇంతకీ తాన్యా ఛటర్జీ ఎవరు?
తానియా ఛటర్జీ కోల్‌కతాకు చెందిన నటి, మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో బోల్డ్ వెబ్ సిరీస్‌ల ద్వారా ఆమె మంచి గుర్తింపు పొందింది. ముఖ్యంగా గాండీ బాత్, క్లాస్ ఆఫ్ 2020 వంటి వెబ్ సిరీస్‌లలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ ప్రాజెక్ట్‌లతో డిజిటల్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన అందం, అభినయంతో పాటు సోషల్ మీడియాలో కూడా తానియా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, ప్రమోషనల్ పోస్టులతో ఫాలోవర్లను ఆకట్టుకుంటుంటారు. ఆమెకు స్టాగ్రామ్‌లో 2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దీంతో డిజిటల్ ప్రపంచంలో ఆమెకు మంచి క్రేజ్ ఉంది.

Yuzvendra Chahal Controversy Who Is Taniya Chatterjee and Why Is She Trending Now

ఇటీవల తానియా చటర్జీ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె పేరు ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది. తాజాగా తానియా చటర్జీ ఈ వివాదంపై స్పందించారు. "నేను చెప్పిన వీడియో సరదాగా జరిగిన సంభాషణలో భాగం మాత్రమే. అది ఇంత పెద్దదై వైరల్ అవుతుందని అసలు ఊహించలేదు" అని తెలిపారు. అయితే ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్ ఎదుర్కొంటున్నానని చెప్పారు. తనను మాత్రమే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారని, మరోవైపు ఎవరూ ప్రశ్నించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే.. చహల్ తరఫున తనకు లీగల్ నోటీసు వచ్చినట్టు చెబుతోంది. అయితే ఆ నోటీసులో ఎంత మొత్తం డిమాండ్ చేశారు? ఎలాంటి చట్టపరమైన ఆరోపణలు ఉన్నాయి? వంటి విషయాలపై ఆమె మాట్లాడటానికి నిరాకరించారు. "ఆ అంశాలను ప్రస్తుతం నా లాయర్లు చూస్తున్నారు" అని మాత్రమే చెప్పారు. ఈ సందర్భంగా తానియా తనపై వస్తున్న విమర్శలకు కూడా సమాధానం ఇచ్చారు. "నేను ఎవరి ఇమేజ్ దెబ్బతీయాలని మాట్లాడలేదు. డిఫమేషన్ అంటే తప్పుడు లేదా అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం. నేను అలాంటిదేమీ చేయలేదు" అని స్పష్టం చేశారు. తాను చహల్‌ను గౌరవిస్తానని, భారత జట్టు తరఫున ఆడే క్రికెటర్‌గా ఆయనపై గర్వంగా ఉందని కూడా చెప్పారు.

ఇక ఈ వివాదం అసలు ఎలా మొదలైంది అంటే.. ఇటీవల తానియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చహల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఫోటోకు స్పందిస్తూ "క్యూట్" అని మెసేజ్ చేశాడని చెప్పింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను కూడా చూపించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, చహల్ పేరు నెట్టింట ట్రెండ్ అయ్యింది. కొందరు దీనిని సరదాగా తీసుకుంటే, మరికొందరు మాత్రం వ్యక్తిగత జీవితం కోణంలో చర్చలు మొదలుపెట్టారు.

ప్రస్తుతం యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్ (Punjab Kings)తరఫున ఆడుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ వివాదం బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే చహల్ లేదా ఆయన లీగల్ టీమ్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. దీంతో తానియా వ్యాఖ్యలు ఎంతవరకు నిజం? నిజంగానే లీగల్ నోటీసు పంపించారా? లేక ఇది సోషల్ మీడియా ప్రచారమేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు సోషల్ మీడియాలో కొందరు తానియా చేసిన వ్యాఖ్యలు పబ్లిసిటీ కోసమేనని అంటుంటే, మరికొందరు ఆమె చెప్పింది నిజమైతే ఎందుకు ట్రోల్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఒక సెలబ్రిటీకి "క్యూట్" అని మెసేజ్ చేయడం తప్పేంటని చహల్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటి వివాదాలు సెలబ్రిటీల ఇమేజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే చహల్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పరువు నష్టం కేసు నిజమైతే, ఇది మరింత పెద్ద చర్చకు దారితీయొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X