డివోర్స్ తర్వాత సమంతను ఫాలో అవుతోన్న ధనశ్రీ వర్మ.. చాహల్‌కు షాకిచ్చేలా!

టీమిండియా స్టార్ క్రికెటర్ యుజువేంద్ర చాహల్ , సినీ నటి ధనశ్రీ వర్మలు ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి కాపురం అనూహ్యంగా విడాకులకు దారితీసింది. విడాకులతో పాటు ధనశ్రీ - చాహుల్ మధ్య కుదిరిన డీల్ సినీ, క్రీడా రంగాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎట్టకేలకు కోర్ట్ ఈ జంటకు విడాకులు మంజూరు చేయడంతో చాహల్ - ధనశ్రీలు అధికారికంగా విడిపోయారు. నాటి నుంచి ఎవరి దారులు వారివి అయ్యాయి.

Yuzvendra Chahal Ex wife Dhanashree Verma special song with rajkummar rao in bhool chuk maaf

ఐపీఎల్‌లో చాహల్ బిజీ

విడాకుల అనంతరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తన జట్టును చేరుకున్నాడు చాహల్. పంజాబ్ కింగ్స్ జట్టు చాహల్‌ను వేలంలో దాదాపు రూ.18 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. తన ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు చాహల్. అటు ధనశ్రీ వర్మ విషయానికి వస్తే.. స్వతహాగా కొరియోగ్రాఫర్, నటి కావడంతో తన కెరీర్‌పై గట్టిగా ఫోకస్ పెట్టింది. ఏకంగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ధనశ్రీ వర్మ

తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజ్ బ్యానర్‌లో ఆమె పనిచేస్తున్నారు. అలాగే యంగ్ కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్‌తో కలిసి స్టెప్పులు వేసిన వీడియోను ధనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి షాకిచ్చారు. తెలుగులో జెండా గట్టిగా పాతాలని ఆమె డిసైడ్ అయ్యారు. తన స్కిల్స్‌తో దర్శక నిర్మాతల కళ్లలో పడేందుకు సిద్ధమవుతున్నారు. ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా అవకాశాలు త్వరగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ అభిమానులు మాత్రం చాహల్ - ధనశ్రీ వర్మలు విడిపోవడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరికొందరైతే ధనశ్రీ తీసుకున్న భరణాన్ని టార్గెట్ చేస్తూ ఆమెను ట్రోల్ చేశారు.

ధనశ్రీ వర్మకు అండగా తల్లి

ఇక ఇటీవల ధనశ్రీ వర్మ విడాకులపై ఆమె తల్లి వర్ష వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ బిడ్డ విడాకులు తమకు సమ్మతమేనని, ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా మాకు అంగీకారమేనంటూ బాంబు పేల్చింది. ధనశ్రీ ఇండిపెండెంట్‌గా తన నిర్ణయాలు తీసుకుంటుందని వర్ష చెప్పారు. ఎంతో ఆలోచించిన తర్వాతే తన కూతురు అడుగులు వేస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.

బాలీవుడ్‌లో ఛాన్స్ కొట్టేసిన ధనశ్రీ వర్మ

ఇదిలాఉండగా ధనశ్రీ వర్మ బాలీవుడ్‌లోనూ అవకాశాలు దక్కించుకోవాలని చూస్తున్నారు. బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ నటించిన భూల్ చుక్ మాఫ్ సినిమాలో ఆమె ఐటెం సాంగ్ చేసే అవకాశం దక్కించుకున్నారు. టింగ్ లింగ్ సజ్నా అంటూ సాగే ఈ పాటలో రాజ్‌కుమార్ రావ్‌తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఇరగదీశారు ధనశ్రీ. రెడ్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోతున్న ఆమె .. హీరోత ఒడిలో కూర్చొని అతనికి హగ్ ఇచ్చింది. మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా ధనశ్రీ నటించిన స్పెషల్ సాంగ్‌పై అందరి చూపు నెలకొంది. ఒకవేళ ఈ సాంగ్ కనుక హిట్ అయితే ఆమె బాలీవుడ్‌లో బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Take a Poll

ధనశ్రీ సమంతను ఫాలో అవుతోందా?

అయితే ధనశ్రీ వర్మ తీరు చూస్తుంటే సౌత్ హీరోయిన్ సమంతే గుర్తొస్తుంది. అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత కూడా ఐటెం సాంగ్స్ చేసింది. పుష్పలో అల్లు అర్జున్‌తో కలిసి ఊ అంటావా మావ అనే సాంగ్‌తో దేశాన్ని ఊపేశారు. ఇప్పుడు ధనశ్రీ కూడా సమంత బాటలోనే రాజ్ కుమార్ రావ్‌తో స్పెషల్ సాంగ్ చేయడం చర్చనీయాంశమైంది. చూడబోతే ధనశ్రీ వర్మ.. సమంతను ఫాలో అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X