భార్యకు విడాకులు.. మిస్టరీ బ్యూటీతో క్రికెటర్.. కొత్త గర్ల్‌ఫ్రెండ్ ఎవరంటే?

ఇండియాలో సినీ తారలు అలాగే క్రికెటర్స్ కి సంబంధించి పలు వార్తలు ఎప్పటికపుడు మంచి ఆసక్తికరంగానే కనిపిస్తూ ఉంటాయి. ఇలా సినీ తారలు క్రికెటర్స్ ని పెళ్లి చేసుకోవడం కానీ లేదా క్రికెటర్సే సినిమాల్లోకి రావడం గాని ఎప్పుడు చూస్తూనే ఉంటాం.. ఇలా ఇండియన్ ఆడియెన్స్ లో అతి పెద్ద ఎంటర్టైనింగ్ ప్లాట్ ఫామ్ లు ఈ రెండూ ఎప్పుడు ఒకింత దగ్గర కనెక్షన్ తోనే ఉంటాయి.

కాగా ఇలా రీసెంట్ గా ప్రముఖ యంగ్ క్రికెటర్ యుజ్వీంద్ర చాహల్ న్యూస్ సోషల్ మీడియాలో సహా బాలీవుడ్ వర్గాల్లో కూడా వైరల్ గా మారింది. కాగా గత కొన్నేళ్ల కితమే ధనశ్రీ వర్మ అనే అమ్మాయిని తాను పెళ్లి చేసుకోగా ఆమె ఇపుడు హీరోయిన్ గా కూడా మారిపోయింది. పెళ్ళికి ముందు వరకు సోషల్ మీడియా వరకే తెలిసిన ఈమె చాహల్ తో పెళ్లి తర్వాత మరింత ఫేమ్ తెచ్చుకుంది.

Yuzvendra Chahal with a mystery girl after divorce with Dhanashri Verma You know who she is

ఇలా తనతో ఐదేళ్లు కూడా కాపురం చెయ్యకుండానే విడాకులు ఇచ్చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. కాగా వీరిపై అధికారికంగా విడాకులు పట్ల రివీల్ కాలేదు కానీ ఇద్దరూ విడిపోయినట్టుగా సినీ వర్గాలు తెలిపాయి. కాగా ఇలా తమ బ్రేకప్ అండ్ విడాకులు వార్తలు రావడం చాహల్ నుంచి ఈమె ఏకంగా 60 కోట్లు భరణం అందుకుంది అనే వార్తలు కూడా ఓ రేంజ్ లో ఊపందుకున్నాయి.

సరే వారిద్దరి చాప్టర్ అక్కడ క్లోజ్ అయ్యింది అనుకున్నారు కానీ ఇపుడు అసలు ట్విస్ట్ ని చాహల్ అందించాడు. కాగా ధనశ్రీతో విడాకులు తర్వాత చాహల్ కొన్నాళ్ళు డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోయాడు కానీ ఇపుడు సడెన్ గా కొత్త రిలేషన్ షిప్ తో ట్విస్ట్ ఇచ్చాడు. నేడు భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ లో తన పక్కన ఒక కొత్త అమ్మాయి కనిపించింది. దీనితో ఈ విజువల్స్ సోషల్ మీడియాలో యిట్టె వైరల్ గా మారిపోయింది.

అయితే ఇక సోషల్ మీడియాలో నెటిజన్స్ అసలు ఆమె ఎవరు అని ఏఐ లని కూడా అడగడం స్టార్ట్ చేశారు కానీ ఆమె ఎవరు అనేది ఆ ఏఐ కూడా చెప్పలేకపోతుంది. కానీ అసలు ఆమె ఎవరు ఏంటి అనేది ఇపుడు తెలుస్తుంది. కాగా ఈమె పేరు మహ్వాష్. ఈమె ఒక నటి, ప్రొడ్యూసర్ కూడా కాగా వీటితో పాటుగా ఆర్జే కూడా అట. దీంతో పాటుగా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కూడా అట.

అలాగే ఈమె ఒక యూట్యూబర్ కూడా.. ఇక ఇంతకు మించి హైలైట్ ఏమిటంటే ఈమెకి ఇన్స్టాగ్రామ్ ప్లాట్ ఫామ్ లో ఏకంగా 1.5 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. దీనితో ఒక నటి నుంచి వైదొలిగి మళ్ళీ ఇంకో నటి దగ్గరకి చాహల్ వచ్చాడని చెప్పాలి. మరి సోషల్ మీడియాలో అయితే ఎవరు ఈ మిస్టరీ గర్ల్ అంటూ చాలా మంది వెతికేస్తున్నారు కానీ ఆమె ఎవరో ఇపుడు రివీల్ అయ్యింది. మరి ఈ కొత్త రిలేషన్ షిప్ లో చాహల్ ఎన్నాళ్ళు కొనసాగుతాడో చూడాలి మరి.

More from Filmibeat

Read more about: indian cinema divorce bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X