twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒకరి చేతిలో పెట్టాంగా వాళ్లే బాధ్యత వహించాలి.. వైవీఎస్ చౌదరి హాట్ పొలిటికల్ కామెంట్స్!

    |

    దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు వద్ద శిష్యరికం చేసి తర్వాత దర్శకుడిగా మారిన వై.వి.యస్.చౌదరి సీతారామరాజు, యువరాజు, సీతయ్య, దేవదాసు లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయం అయిన రేయ్ సినిమా భారీ డిజాస్టర్ గా నిలవడంతో ఆయన అప్పటి నుంచి మరో సినిమా చేయలేదు.. అయితే తాజాగా ఈ రోజు అంటే 23 మే 2021 ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఒక తెలుగు పత్రికతో ఆయన ముచ్చటించారు.

    ఈ సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన కొన్ని ఆశక్తికర విషయాలు పంచుకున్న ఆయన ఈ కరోనా పరిస్థితుల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా ఈ స్థాయిలో విజృంభించ దానికి కారణాలు ఏమిటి అని ఆయనని ప్రశ్నించగా ముందుచూపు లేకపోవడమేనని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయంలో ప్రత్యేకంగా ఏ ఒక్కరిని నిందించలేమని పేర్కొన్న వై.వి.యస్.చౌదరి రెండో దశ ఇంత ఉధృతి లేకపోయి ఉంటే ఇదంతా మన కర్మభూమి అందుకే రాలేదని పొలిటికల్ స్టేట్మెంట్లు వచ్చేవని ఆయన అన్నారు.

    YVS Chowdary hot political comments on corona

    అలా జరగలేదు కాబట్టే ఇప్పుడు ముందే ఎందుకు హెచ్చరించలేదని అడిగే పరిస్థితికి వచ్చామని అన్నారు. ఏదేమైనా మనం పరిపాలన ఒకరి చేతిలో పెట్టాము కాబట్టి ప్రస్తుత పర్యవసానాలు అన్నింటికీ వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. అయితే ప్రత్యేకంగా ఎవరినీ ప్రస్తావించకపోయినా అధికారంలో ఉన్న నాయకులనే ఆయన సంబోధించి ఉంటారనే వాదన వినిపిస్తోంది. ఇక ఆయన మళ్లీ ఒక తెలుగుదనం నిండిన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. మరి చూడాలి అంతటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మళ్లీ హిట్ నందుకుని ట్రాక్లో నిలబడతారో లేదో.

    English summary
    Y.V.S. Chowdary is a director and writer, known for seetha rama raju, yuvaraju, seethayya, devadas. he made some interesting comments on corona situations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X