కాటు వేసేందుకు వస్తోన్న జాంబిరెడ్డి.. సమంతతో స్పెషల్ ప్లాన్
కొత్త కథలను తెలుగు తెరకు పరిచయం చేయాలన్న ఉత్సాహం ఉన్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. అతను.. అ!, కల్కి వంటి భిన్న చిత్రాలతో మంచి పేరును తెచ్చుకున్నాడు. అయితే ఈ రెండు ప్రాజెక్ట్‌లు కూడా కమర్షియల్‌గా అంతగా వర్కవుట్ అవ్వలేదు. అయితే అ! సీక్వెల్ కోసం ప్రశాంత్ వర్మ చాలానే కష్టపడ్డాడు. అంతలోపే కరోనా లాక్డౌన్ రావడంతో మరో కొత్త కథను రెడీ చేశాడు. అదే జాంబిరెడ్డి. టైటిల్ అనౌన్స్ మెంట్ దగ్గరి నుంచి ప్రతీ విషయంలో ప్రశాంత్ వర్మ ఎంతో జాగ్రత్త పడుతున్నాడు.
ప్రతీ అనౌన్స్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాలానే ప్లాన్ చేస్తున్నాడు. టైటిల్ ప్రకటన, హీరో మోషన్ పోస్టర్ ఇలా అన్నీ సరైన సమయానికి సరైన ప్లానింగ్‌తో తీసుకొచ్చాడు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా హీరో తేజ సజ్జా లుక్‌ను రివీల్ చేసే మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ఇక ఇప్పుడు టీజర్‌ను కూడా వెరైటీగా ప్లాన్ చేశాడు. జాంబీ రెడ్డి నుంచి టీజర్ రాబోతోందని కూడావెరైటీగా ప్రకటించాడు. ఫస్ట్ బైట్ (మొదటి కాటు) వేసేందుకు జాంబి రెడ్డి వస్తోందని తెలిపాడు.

అయితే ఆ టీజర్‌ను ఎవరు రిలీజ్ చేయబోతోన్నాడన్న విషయాన్ని అప్పుడు చెప్పలేదు. తాజాగా ఆ సర్ ప్రైజ్‌ను కూడా బయటపెట్టేశారు. సమంత చేతుల మీదుగా ఆ మొదటి కాటును టాలీవుడ్ ప్రేక్షకులకు చూపెట్టనున్నాడు. రేపు (డిసెంబర్ 5) ఉదయం 11 గంటల 15 నిమిషాలకు జాంబి రెడ్డి టీజర్ రాబోతోందని యూనిట్ ప్రకటించింది. మొత్తానికి సమంతను తీసుకొచ్చి టీజర్‌పై హైప్ పెంచేశారు.


Click it and Unblock the Notifications











