అదిరిన బర్త్ గిఫ్ట్.. మెగా ఫ్యాన్స్‌కు ‘జాంబిరెడ్డి’ సర్ ప్రైజ్
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా అదిరిపోయే సర్ ప్రైజ్‌లు, స్పెషల్ గిఫ్ట్స్ రెడీ అవుతున్నాయి. చిరంజీవి 65వ బర్త్ డే సందర్భంగా 65 మంది ఇండియన్ సినీ సెలెబ్రిటీలతో కామన్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేయించబోతోన్నారు. ఇప్పటికే అన్ని భాషల ఇండస్ట్రీల నుంచి టా ప్ సెలెబ్రిటీలను సమాయత్తం చేశారు. ఇక చిరు బర్త్ డే వేడుకల్లో భాగంగా నేడు జాంబి రెడ్డి చిత్ర యూనిట్ స్పెషల్ సర్ ప్రైజ్‌ను రెడీ చేసింది. ఈ మేరకు ఓ చిన్న టీజర్ లాంటిది రిలీజ్ చేశారు.
వినూత్న దర్శకుడు ప్రశాంత్ వర్మ అ!, కల్కి చిత్రాలతో మంచి పేరును తెచ్చుకున్నాడు. ఇక తన మూడో ప్రాజెక్ట్‌గా కరోనా వైరస్‌ను ఎంచుకున్నాడు, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ మధ్య టైటిల్ పోస్టర్‌తో చిత్రయూనిట్ రచ్చ చేసింది. జాంబి రెడ్డి అంటూ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. ఈ చిత్రయూనిట్ మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు ఓ గిఫ్ట్ ఇచ్చింది.

జాంబి రెడ్డి చిత్రం 80-90ల నాటి కాలానికి సంబంధించిన కథలా అనిపిస్తోంది. నాటకాలు, సినిమాల హవా కొనసాగుతున్న క్రమంలో చిరంజీవి స్వర్ణయుగం మొదలైన రోజుల్లో ఈ సినిమా కథ జరుగుతుందని అర్థమవుతోంది. ఇక ఇందులో హీరో చిరు వీరాభిమాని అయి ఉంటాడు. ఈ మేరకు రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌లో వీర హనుమాన్ నాట్య మండలి అని ఉండటం.. హీరో వేసుకున్న డ్రెస్‌పై చిరంజీవి బొమ్మ, దానికి తగ్గట్టు వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. మొత్తానికి ఇది మెగా ఫ్యాన్స్‌ను మెప్పించే బహుమతి అని చెప్పవచ్చు. ఈ సినిమాలో నటించబోయే హీరో ఎవరనేది ఆగస్ట్ 23న ఉదయం పది గంటలకు ప్రకటించబోతోన్నట్టు తెలిపారు.


Click it and Unblock the Notifications











