ప్రభాస్ బర్త్ డే.. ‘జాంబి రెడ్డి’ స్పెషల్ సర్ ప్రైజ్
అ!, కల్కి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ మూడో ప్రయత్నంగా మరో కొత్త కాన్సెప్ట్‌ను ఎంచుకున్నాడు. కరోనా వైరస్ వ్యాక్సిన్ లోడింగ్ అంటూ మంచి హైప్ పెంచుతూ.. జాంబిరెడ్డిపై అంచనాలు క్రియేట్ అయ్యేలా చేశాడు. ఈ మూవీ ప్రమోషన్స్ కూడా సరైన టైంలో సరైన పద్దతిలో చేస్తుండటంతో అందరికీ చేరువవుతోంది. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా జాంబి రెడ్డి నుంచి టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ తేజా సజ్జ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక చిరు బర్త్ డే సందర్భంగా తేజ ఫస్ట్ లుక్ రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఇంద్ర సినిమాలో చిన్న పిల్లాడిలా ఉన్న తేజ.. జాంబిరెడ్డిలో హీరోగా మారడంతో మెగా ఫ్యాన్స్ విషెస్ అందించారు. అయితే ప్రభాస్ బర్త్ డే సందర్భంగా మరో సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్టుంది.

ఈ మేరకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. రెబల్ స్టార్ మన డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వబోతోన్నాం.. రేపు ఉదయం జాంబి రెడ్డి టీం నుంచి రేపు ఉదయం పది గంటలకు సర్ ప్రైజ్ రాబోతోందని టీం ప్రకటించింది. ఇక మరి ఈ మూవీ ఏదైనా టీజర్‌ను రిలీజ్ చేస్తారేమో చూడాలి.


Click it and Unblock the Notifications











