twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘టచ్ మై బాడీ’ అంటూ రెచ్చిపోయింది( వీడియో)

    By Srikanya
    |

    ముంబై :బాలీవుడ్ ముదురు బ్యూటీ బిపాసా బసు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..పరిచయం చెయ్యక్కర్లేదు. బాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ బ్యూటీల్లో ఒకరైన ఆమె ‘టచ్ మై బాడీ' అంటూ ఇప్పుడు రెచ్చిపోతోంది. మైమరిపించే పెర్ఫార్మెన్స్ తో పాటు..బికినీలు వేయడం దగ్గర నుండి ముద్దు సీన్ల వరకు ప్రేక్షకుడికి మత్తెక్కించే అనుభూతి కలిగించడం ఆమె స్టైల్. ఈమె ఈ క్రింద వీడియో సాంగ్ లో ఎలా రెచ్చిపోయిందో ఒకసారి చూడండి...

    https://www.facebook.com/TeluguFilmibeat

    చిత్రం వివరాల్లోకి వెళితే...

    బిపాసా బసు త్వరలో 'ఎలోన్' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెక్స్ అండ్ హారర్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తన కెరీర్లో అత్యంత శృంగార భరితంగా, బోల్డ్ గా చేసిన సినిమా ఇదే అని బిపాసా బసు స్వయంగా చెప్పడం గమనార్హం.

    Bipasha Basu says ‘Touch my body’

    ఈ చిత్రానికి భూషణ్ పటేల్ దర్శకత్వం వహిస్తున్నారు. బిపాస బసుకు జోడీగా కరణ్ సింగ్ గ్రోవర్ నటిస్తున్నాడు. జాకీర్ హుస్సేన్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం భయం రేకెత్తించడంతో పాటు బిపాసా బసు శృంగార చేష్టలతో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

    ఆ మధ్యన ఎలోన్ చిత్రంలో బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ మధ్య హాట్ హాట్ ముద్దు సీన్లు చిత్రీకరించారు. హిందీ టీవీ సీరియల్ నటుడు అయిన కరణ్ సింగ్ గ్రోవర్ 'ఎలోన్' చిత్రం ద్వారా బాలీవుడ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. గతంలో భూషణ్ పటేల్ 1920:ఈవిల్ రిటర్న్స్, రాగిని ఎంఎంఎస్-2 లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ సినిమాలు మంచి విజయం సాధించాయి.

    సినిమాలో హరర్ సీన్లతో పాటు శృంగార సన్నివేశాలకు పెద్ద పీట వేసారు. సముద్రం ఒడ్డున చిత్రీకరించిన రొమాంటిక్ సాంగులు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి. ఈ చిత్రానికి సంబందించిన పోస్టర్స్ ఇటీవలే విడుదలై ఆకట్టుకుంటున్నాయి. సినిమా సెక్స్ అండ్ హారర్ మిక్స్ అని చెప్పకనే చెబుతున్నాయి.

    'ఎలోన్' తన తొలి చిత్రం కావడంతో కరణ్ సింగ్ గ్రోవర్ ఈ చిత్రంపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో బిపాసా బసుకు సరైన పెద్ద హిట్టు అంటే ఏమీ లేదు. ఈ చిత్రం తనకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తోంది. పనోరమ స్టూడియోస్ వారు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుమార్ మంగత్, అభిషేక్ పాథక్, ప్రదీప్ అగర్వాల్, ప్రశాంత్ శర్మ నిర్మాతలు. ఈ చిత్రాన్ని జనవరి 16, 2015న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    English summary
    Titled ‘Touch my body’, there is a party number in the film where sexy Bipasha dances with hero Karan on the dance floor. In the upcoming horror flick ‘Alone’ where she plays as a congenial twins, Bips is soaring the temperatures high with her dare-bare acts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X