Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'బాహుబలి' కి హాలీవుడ్ ఎడిటర్... పూర్తి డిటేల్స్
హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం ఇప్పుడు ఇంటర్నేషనల్ వెర్షన్ పై దృష్టి పెట్టింది. అక్కడి వారి అంతర్జాతీయ నిపుణులతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. అందులో బాగంగా...హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన Vincent Tabaillon అనే ఎడిటర్ ని ఎంపిక చేసారు.
Vincent Tabaillon గతంలో.."The Incredible Hulk", "Clash of the Titans", "Taken 2" and most recently, "Now You See Me" చిత్రాలకు పనిచేసారు. మొదట్లో ఫ్రెంచ్ చిత్రాలకు పనిచేసిన ఆయన ఇప్పుడు హాలీవుడ్ లో సెటిల్ అయ్యారు. ఆయన ఎడిట్ చేసే ఈ చిత్రం ఫిలిం ఫెస్టివల్స్ కు వెళ్తుంది. అలాగే ఇక్కడ ఆగస్టులో రిలీజ్ అయ్యే అవకాసం ఉంది. ఒరిజనల్ చిత్రానికి దీనికి తేడా ఉంటుంది.
చిత్రం
కలెక్షన్స్
విషయానికి
వస్తే...
బాక్సాఫీసు
దగ్గర
సరికొత్త
రికార్డులు
లిఖిస్తూ..
దూసుకుపోతున్న
'బాహుబలి'
తెలుగు
సినిమాని
రూ.200
కోట్ల
మైలురాయి
దగ్గరకు
చేర్చేసింది.
కేవలం
5
రోజుల్లోనే
ఈ
ఘనత
సాధించిన
చిత్రంగా
'బాహుబలి'
చరిత్ర
సృష్టించింది.
మంగళవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 'బాహుబలి' రూ.220 కోట్లకు పైచిలుకు వసూళ్లు సాధించింది. హిందీ వెర్షన్ రూపంలో దాదాపు రూ.35 కోట్ల వసూళ్లు అందుకొంది. ఓ దక్షిణాది చిత్రం హిందీలో అనువాదమై ఈ స్థాయిలో వసూళ్లు దక్కించుకోవడం బాలీవుడ్‌ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. తొలి రోజే సరికొత్త రికార్డులను నెలకొల్పిన 'బాహుబలి' ఆ దూకుడు 5 రోజులూ కొనసాగించింది.
మరీ ముఖ్యంగా తొలి వారాంతంలో రూ. 105 కోట్ల షేర్ సాధించిన తొలి భారతీయ చిత్రంగా 'బాహుబలి' జెండా ఎగరేసింది. అంతకు ముందు 'ధూమ్' (రూ.100 కోట్లు), 'హ్యాపీ న్యూ ఇయర్' (రూ.99 కోట్లు) రికార్డు 'బాహుబలి' తిరగరాసినట్త్టెంది.
అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రంగా 'రోబో' (రూ.290 కోట్లు) తొలిస్థానంలో ఉంది. ఇప్పుడు ఆ రికార్డు దిశగా 'బాహుబలి' దూసుకుపోతోంది. తొలి వారంలో కచ్చితంగా 'బాహుబలి' 'రోబో' రికార్డుని దాటుకెళ్లడం ఖాయమని ట్రేడ్ వర్గాలు లెక్కలుగడుతున్నాయి.
సాధారణంగా స్టార్ కథానాయకుల చిత్రాలు సోమవారం నుంచి కాస్త నెమ్మదిస్తాయి. అయితే 'బాహుబలి' మాత్రం సోమ, మంగళ, బుధవారాల్లోనూ తన దూకుడు చూపిస్తోంది. నాలుగోరోజు రూ.60 కోట్లు, 5వ రోజు 44 కోట్ల షేర్ సాధించి.. తన జోరు తగ్గలేదని నిరూపించింది. మరి భవిష్యత్తులో 'బాహుబలి' ఇంకెన్ని ప్రకంపనాలు సృష్టిస్తుందో చూడాలని ట్రేడ్ లో ఎదురుచూస్తున్నారు.