» 

అది కూడా చూపించాలా? ముమైత్

ఇక తనదగ్గర ప్రత్యేకంగా చూపించటానికి ఏముందని ముమైత్ ఖాన్ వాపోతోంది. అంగాంగ ప్రదర్శన చేస్తున్న ఈ ఐటమ్ గర్ల్ తన శరీరంలో కేవలం పదిశాతం మాత్రమే తెరపై ఎక్సపోజ్ కాలేదని అంటోంది. అలాగే అది కూడా చూపితే అసహ్యం తప్ప మరేమీ ఉండదని అసహ్యించుకుంటోంది. ఓ ఐటమ్ సాంగ్ లో ఓ పాప్ ఆల్బమ్ చూపి మరింతగా ఎక్సపోజ్ చేయమని అడిగినప్పుడు ఆమె తీవ్రంగా స్పందిస్తూ ఇలా అందని తెలిసింది. అయితే ఈ పరిస్ధితికి ఆమే కారణమని అంటున్నారు. ఆమె మొదటనుంచీ దూసుకుపోవాలన్న ఆతృతతో తోటి వారికన్నా దూకుడుతో ఉన్నవరకూ ఇప్పేసిందని అదే ఈ రోజు ఇలాంటి మాటలకు ఆస్కారమిస్తోందని అంటున్నారు. అయితే కొరియోగ్రాఫర్స్ మాత్రం ఎప్పుడూ ఏదో కొత్త దనం చూపాలి, సినిమా సినిమాకూ వేరియోషన్ చూపకపోతే ఎవరూ అవకాశం ఇవ్వరని కరాఖండిగా చెప్తున్నారు. పున్నమినాగు సినిమాలో ముమైత్ చేసిన అంగాంగ ప్రదర్శన పూర్తి స్ధాయిలో ఉండటంతో ఈ రోజు పరిస్ధితి ఇలాంటిది వచ్చిందని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో మగధీర చిత్రంలో తాను చేసిన బంగారు కోడిపెట్ట సాంగ్ తనకి సంతృప్తినిచ్చిన ఐటం సాంగ్ అని చెప్పింది.

Read more about: mumaith khan, pokiri, item girl, punnami nagu, exposing, yogi, magadheera, rajamouli, ముమైత్ ఖాన్, పోకిరి, పూరి జగన్నాధ్, ఐటం గర్ల్, మగధీర, రాజమౌళి

Telugu Photos

Go to : More Photos