» 

మెగా హీరోలకు పోటీగా మంచు ఫ్యామిలీ...

Posted by:
Give your rating:

హైదరాబాద్ : మెగా హీరోలు అల్లు అర్జున్,రామ్ చరణ్ ఇద్దరూ ఇప్పుడు మళయాళంలో ప్రవేశించి సక్సెస్ అయ్యారు. అల్లు అర్జున్ మొదట తానేంటో ప్రూవ్ చేసుకుని అక్కడ మార్కెట్ విస్తరించుకున్నాడు. అల్లు అర్జున్ అండతో కేరళలో ఎవడు చిత్రం రిలీజై..మెల్లిగా రామ్ చరణ్ ని అక్కడ అలవాటు చేసే పనిలో పడింది. ఇప్పుడు వాళ్లకు పోటీగా మంచు ఫ్యామిలీ రంగంలోకి దిగింది. మంచు కుటుంబ చిత్రం 'పాండవులు పాండవులు తుమ్మెద' మళయాళంలో డబ్బింగ్ వెర్షన్ విడుదల అవుతోంది.

పాండవపురం టైటిల్ తో ఫిబ్రవరి 14న అక్కడ విడుదలైంది. గతంలోనూ మంచు విష్ణు నటించిన దేనికైనా రెడీ,దూసుకెళ్తా చిత్రాలు ఎందునమ్ రెడీ, సకలకళా వల్లవన్ టైటిల్స్ తో విడుదలయ్యాయి. ఇప్పుడీ పాండవపురం చిత్రం సైతం అక్కడ మంచి రెవిన్యూని సాధిస్తుందని నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రంలో మంచు సోదరులు,తండ్రి మోహన్ బాబు ఉన్నారు. కామిడీతో రూపొందిన ఈ చిత్రం ఇక్కడ మంచి విజయమే సాధించింది.

చిత్రంలో మోహన్ బాబు పాత్ర పేరు నాయుడు. ఆ పాత్ర నోటికి దురుసు ఎక్కువ. చేతికి దురదెక్కువ. సినిమాలో విష్ణు రఫ్‌ అండ్‌ టఫ్‌గా కనిపిస్తాడు. మనోజ్‌ స్త్రీ పాత్రలో కనిపిస్తాడు. బృహన్నలగా ఎన్టీఆర్‌గారికి ఎంత పేరు వచ్చిందో ఇందులో మోహినిగా మనోజ్‌కి అంతటి పేరు వచ్చిందని చెప్తున్నారు. సినిమా ద్వితీయార్ధంలో మనోజ్‌ మోహినిగా విజృంభించాడు.

దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ "మొదట ఈ సినిమాని మోహన్‌బాబు, విష్ణు హీరోలుగా అనుకుని మొదలుపెట్టాం. తర్వాత కథ మారింది. మనోజ్, వరుణ్, తనీశ్ పాత్రలు కూడా వచ్చి చేరి, 'పాండవులు పాండవులు తుమ్మెద' అయ్యింది. ఇలాంటి ప్రతిష్ఠాత్మక చిత్రానికి దర్శకుణ్ణవడం అదృష్టంగా భావిస్తున్నా. సెకండాఫ్‌కి మనోజ్ కేరక్టర్ హైలైట్. మూగవానిగా తనీశ్ మంచి నటన ప్రదర్శించాడు'' అని తెలిపారు.

మోహన్ బాబు మాట్లాడుతూ...''నేను పూర్తిస్థాయి ప్రధాన పాత్రలో నటించి పదేళ్లవుతోంది. నా కొడుకులు హీరోగా మంచి స్థానంలోకి వచ్చారు. ముగ్గురం కలసి నటిద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. కథ కోసం ఇన్నాళ్లు ఆగాం. 'రావణ' చేద్దామనుకుంటే దానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. దీంతో 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమా చేశాం. మేం అనుకున్నట్లుగా సినిమా చక్కగా వచ్చింది. రవి, కోనవెంకట్‌, బీవీఎస్‌రవి, గోపీమోహన్‌ చక్కటి కథని సిద్ధం చేశారు. దాన్ని శ్రీవాస్‌ ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. మంచు విష్ణు, మనోజ్‌, వరుణ్‌సందేశ్‌, తనీష్‌, రవీనాటాండన్‌, హన్సిక, ప్రణీత తమ పాత్రలమేరకు చక్కటి ప్రతిభకనబర్చారు. '' అన్నారు.

Read more about: manchu vishnu, mohan babu, manchu manoj, pandavulu pandavulu tummeda, మోహన్ బాబు, మంచు మనోజ్, మంచు విష్ణు, పాండవులు పాండవులు తుమ్మెద
English summary
According to Manchu Vishnu, producer of the film, the Malayalam version of the PPT has been titled as Pandavapuram 2014 and it is scheduled to release on 14th February.
Please Wait while comments are loading...