twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రివ్యూ రైటర్స్ ఫై తెలుగు దర్శకుడు ఓ రేంజిలో ఫైర్

    By Srikanya
    |

    హైదరాబాద్:తెలుగు సినిమాల్ని విమర్శించేవాళ్లు నిజంగా విమర్శకులేనా?ఒక్కసారి వాళ్లేం రాస్తున్నారో ఆలోచించుకొంటే బాగుంటుంది. సినిమా చూస్తున్నప్పుడు వాళ్ల దృష్టికోణం ఏమిటి? ఏ పరిస్థితుల్లో సినిమా చూస్తున్నారు? అనేది నిశితంగా వాళ్లే గమనించుకోవాలి.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    మైకు పట్టుకొన్నవారల్లా మాట్లాడేస్తానంటే ఎలా? టైప్‌ చేయడం వస్తే.. రివ్యూలు రాసేస్తారా? ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లు విస్తృతమయ్యాయి. ప్రతీవాళ్లూ సినిమాని విమర్శిస్తున్నారు. ఏది మంచి సినిమానో, ఏది కాదో నిర్ణయించుకొనే అవకాశం ప్రేక్షకులకు ఇవ్వడం లేదు అంటూ రివ్యూ రైటర్లపై దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఫైర్ అయ్యారు.

    Praveen Sattaru fire on film review writers

    ఆయన డైరక్ట్ చేసిన 'చందమామ కథలు' చిత్రానికి జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. ఈ చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు) విభాగంలో జాతీయ అవార్డు అందుకొంది. ఈ చిత్రానికి ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. 'ఎల్బీడబ్ల్యూ', 'రొటీన్‌ లవ్‌స్టోరీ' చిత్రాలతో ఆకట్టుకొన్నారు ప్రవీణ్‌. ''నిజాయతీగా చేసిన ఓ మంచి ప్రయత్నానికి దక్కిన గౌరవం ఇది. ఈ సినిమా కోసం చాలామంది కష్టపడ్డారు.. వాళ్లందరికీ కృతజ్ఞతలు'' అన్నారు.

    అవార్డు దక్కడానికి కారణమైన అంశాలని విశ్లేషిస్తూ.... ఎనిమిది కథల్ని ఒకేచోట కూర్చడం అనుకొన్నంత సులభం కాదు. కథనంలో బలం ఉంటేనే అది సాధ్యం అవుతుంది. దాంతో పాటు ఈ సినిమాలో స్పృశించిన అంశాలు, కథలు.. ఇవన్నీ మన కళ్లముందు జరిగేవే. ట్రాఫిక్‌జామ్‌లో ఆగి చుట్టూ చూస్తే.. ఓ సమాజం కనిపిస్తుంది. రకరకాలైన వ్యక్తులు తారసపడతారు. వాళ్ల కథే తెరపై చూపించాం. ఆ విషయం కూడా జ్యూరీకి నచ్చి ఉంటుంది. అయితే దురదృష్టవశాత్తు ఇది మన విమర్శకులకు నచ్చలేదు అని చెప్పుకొచ్చారు.

    ఇక ఏవో అవార్డులు సాధించాలని ఈ సినిమా చేయలేదు. కథని కథగా చెప్పాలన్న ప్రయత్నంతో తీసిన సినిమా ఇది. అవార్డు గురించి ఆలోచించలేదు. ఒకవేళ వస్తే... సినిమాటోగ్రఫీకి వస్తుందనుకొన్నా. ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా నిలుస్తుందని అనుకోలేదు అని అన్నారు.

    English summary
    Chandamama Kathalu director Praveen Sattaru fire on film review writers today. The small-budget film, Chandamama Kathalu, has won the National Award for best Telugu film over biggies like Manam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X