Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సచిన్ జోషి 'హీరో హంటింగ్ అఫ్ బోంబే మిల్స్'
హైదరాబాద్: హిందీలో ఆజాన్, ముంబై మిర్రర్, జాక్ పాట్ వంటి చిత్రాలతో హీరోగా, నిర్మాతగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు సచిన్ జోషి. తొలిసారిగా ఒక బయట నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం 'హంటింగ్ అఫ్ బోంబే మిల్స్'లో హీరో గా నటిస్తున్నారు. అయుష్ రైనా ఈ సినిమాకు దర్శకుడు.
నిజ జీవితంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో అతీంద్రియ శక్తుల నేపధ్యంలో ప్రవల్ రామన్ ఈ చిత్ర కథను రాశారు. తెలుగులో మౌనమేలనోయి, నిను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు చిత్రాలతో సచిన్ జోషి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆషికీ 2ను తెలుగులో 'నీ జతగా నేనుండాలి' పేరుతో రీమేక్ చేశారు.
ఇప్పటివరకూ సోలో హీరోగా నటించిన సచిన్ జోషి 'హంటింగ్ అఫ్ బోంబే మిల్స్' సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా సచిన్ జోషి మాట్లాడుతూ.. తొలిసారి ఒకరు స్క్రిప్ట్ తో నా వద్దకు వచ్చి ఒక పాత్రలో నటించాలి అని అడగగానే నేను ఆశ్చర్యపోయాను. 'హంటింగ్ అఫ్ బోంబే మిల్స్' సినిమాలో నేను సూరజ్ వాద్వా అనే బాగా ధనవంతుడైన పారిశ్రామికవేత్తగా కనిపిస్తాను. ఎల్లప్పుడూ చుట్టూ బాడీగార్డ్స్ ఉంటారు. విలాసవంతమైన జీవితం గడిపే ఒక యువకుడు. నా ప్రతి సినిమాలో హీరోగా నటిస్తూ.. నిర్మాణ పరంగా నేను కీలక నిర్ణయాలు తీసుకునేవాడిని. తొలిసారిగా దర్శకుడి సూచనలను ఫాలో అవ్వడానికి సిద్దమయ్యాను అన్నారు.
సచిన్ జోషి భార్య రైనా జోషి పుట్టినరోజు వేడుకలలో దర్శక రచయితలు ఆయుష్ రైనా, ప్రవల్ రామన్ ను ఈ హీరోను చూశారు. తమ కథలో సూరజ్ వాద్వా పాత్రకు సచిన్ జోషి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడని భావించడం, తర్వాత అతనితో కలసి మాట్లాడడం జరిగాయి. సచిన్ జోషి వెంటనే'హంటింగ్ అఫ్ బోంబే మిల్స్'లో నటించడానికి అంగీకరించడంతో ఆయుష్ రైనా, ప్రవల్ రామన్ లు సంతోషం వ్యక్తం చేశారు. హిందీ తెలుగు భాషలలో'హంటింగ్ అఫ్ బోంబే మిల్స్'సినిమాను తెరకెక్కిస్తున్నారు.