twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తండ్రే నిర్మాత అయితే...అల్లు శిరీష్‌ లాంటి హీరోకు ఈ రికార్డ్ ఓ లెక్కా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రం నిన్న గ్రాండ్ గా రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజైంది. హైదరాబాద్ లాంటి సిటీలో 60 థియేటర్లు, బెంగుళూరులో 40 థియేటర్లు... దేశవ్యాప్తంగా మొత్తం 500 థియేటర్లు.

    ఒక్కోసారి పెద్ద స్టార్స్ ఉన్న సిసినిమాలకు కూడా ఇన్ని థియేటర్స్ దొరకడం చాలా కష్టం. మరి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న, కెరీర్లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్స్ ఏమీ లేని అల్లు శిరీష్ సినిమాకు ఇంత పెద్ద రిలీజ్ ఎలా సాధ్యం అయింది? అంటే దీని వెనక సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయిలో ఉన్న ఆయన తండ్రి, ప్రముఖ బడా నిర్మాత అల్లు అరవిందే అని చెప్పక తప్పదు.

    అల్లు శిరీష్‌కు అన్నీ అందుబాటులో ఉన్నాయి. మెగా ప్యామిలీ నేపథ్యం, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టయినా సినిమాలు నిర్మించే ఫాదర్... మెగా ఫ్యాన్స్ సపోర్ట్. ఆయన చేయాల్సిందల్లా తనను తాను హీరోగా నిరూపించుకోవడం. ఇప్పటికే అల్లు అర్జున్ వీటన్నింటినీ బాగా వాడుకుని టాలీవుడ్లో ఓ రేంజికి ఎదిగిపోయిన సంగతి తెలిసిందే.

    స్లైడ్ షోలో 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాకు సంబంధించిన విశేషాలు...

    సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...

    సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...

    ప్రోమోలలో క్రియేట్ చేసినంత క్యూరియాసిటీకు తగినట్లు గా చిత్రం లేదు కానీ , అల్లు శిరీష్ గత రెండు చిత్రాల కన్నా బెస్ట్ అనిపించింది.

    అల్లు శిరీష్

    అల్లు శిరీష్

    పరమ రొటీన్ కథ,కథనంతో పరుశరామ్ చేసిన ఈ చిత్రంలో అల్లు శిరీష్ అయితే నటనలో మెచ్యూరిటి కనపరిచాడు.

    లావణ్య త్రిపాఠి

    లావణ్య త్రిపాఠి

    ముఖ్యంగా ఈ సినిమాకు లావణ్య త్రిపాఠి నటన కలిసివచ్చింది. మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రకు ప్రాణం పోసింది. కేవలం ఫన్నీ సీన్స్ లోనే కాక ఎమోషన్ సీన్స్ లోనూ తన సత్తా ఏంటో చూపెట్టింది.

    అల్లు అరవింద్

    అల్లు అరవింద్

    సినిమాలో బోర్ పెద్దగా లేదు కాబట్టి.. అల్లు అరవింద్ ఇలాంటి సినిమాలను లేపటంలో సరైనోడు కావడంతో భారీగా రిలీజ్ చేసి సినిమాను లాభాల్లోకి తెచ్చేందుకు ప్లానింగ్ మొత్తం ఉపయోగిస్తున్నాడు.

    English summary
    Allu Sirish's Srirasthu Subhamasthu hit over 500 screens across the country, including 60 theatres in Hyderabad and 40 theatres in Bengaluru, besides overseas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X