twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి నెక్ట్స్ టార్గెట్ రివిల్ చేసిన విజయేంద్రప్రసాద్

    By Srikanya
    |

    హైదరాబాద్: బాహుబలి చిత్రం ఘన విజయం సాధించటంతో ...చిత్ర కధా రచయిత, రాజమౌళి తండ్రి విజియోంద్రప్రసాద్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ నేపధ్యంలో ఆయన చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ.... రాజమౌళి తదపరి టార్గెట్ గురించి వివరించారు.

    విజియోంద్రప్రసాద్ మాట్లాడుతూ... రాజమౌళి కల ఏమిటంటే... మహాభారతాన్ని ఇండియన్ కాన్వాస్ పై ఫ్రేమ్ చేయటమే అన్నారు. మహాభారతానికి బాహుబలి ట్రైలర్ మాత్రమే అని ఒకసారి తనతో చెప్పనట్లు ఆయన తెలియచేసారు. అంటే మరో అద్బుతం వెండితెరపై త్వరలో ఆవిష్కరణ జరగబోతోందన్నమాట.

    ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళ, హిందీ, మళయాళ భాషల్లో రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం ఇప్పుడు ఇంటర్నేషనల్ వెర్షన్స్ పై దృష్టి పెట్టింది. అందులో భాగంగా చైనీస్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో మినిమం వంద కోట్లు సంపాదించాలని టార్గెట్ చేసినట్లు చెప్తున్నారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ ప్రేక్షకులు చూడటం కోసం ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Vijayendra Prasad Confirms Rajamouli's Next Target!

    అలాగే ఆ ప్రేక్షకులను అందుకోవాలంటే... అంతర్జాతీయ నిపుణులతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. అందులో బాగంగా...హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన Vincent Tabaillon అనే ఎడిటర్ ని ఎంపిక చేసారు.

    Vincent Tabaillon గతంలో.."The Incredible Hulk", "Clash of the Titans", "Taken 2" and most recently, "Now You See Me" చిత్రాలకు పనిచేసారు. మొదట్లో ఫ్రెంచ్ చిత్రాలకు పనిచేసిన ఆయన ఇప్పుడు హాలీవుడ్ లో సెటిల్ అయ్యారు. ఆయన ఎడిట్ చేసే ఈ చిత్రం ఫిలిం ఫెస్టివల్స్ కు వెళ్తుంది. అలాగే ఇక్కడ ఆగస్టులో రిలీజ్ అయ్యే అవకాసం ఉంది. ఒరిజనల్ చిత్రానికి దీనికి తేడా ఉంటుంది.

    చిత్రం కలెక్షన్స్ విషయానికి వస్తే...

    బాక్సాఫీసు దగ్గర సరికొత్త రికార్డులు లిఖిస్తూ.. దూసుకుపోతున్న 'బాహుబలి' తెలుగు సినిమాని రూ.200 కోట్ల మైలురాయి దగ్గరకు చేర్చేసింది. కేవలం 5 రోజుల్లోనే ఈ ఘనత సాధించిన చిత్రంగా 'బాహుబలి' చరిత్ర సృష్టించింది.

    Vijayendra Prasad Confirms Rajamouli's Next Target!

    మంగళవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 'బాహుబలి' రూ.220 కోట్లకు పైచిలుకు వసూళ్లు సాధించింది. హిందీ వెర్షన్‌ రూపంలో దాదాపు రూ.35 కోట్ల వసూళ్లు అందుకొంది. ఓ దక్షిణాది చిత్రం హిందీలో అనువాదమై ఈ స్థాయిలో వసూళ్లు దక్కించుకోవడం బాలీవుడ్‌ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. తొలి రోజే సరికొత్త రికార్డులను నెలకొల్పిన 'బాహుబలి' ఆ దూకుడు 5 రోజులూ కొనసాగించింది.

    మరీ ముఖ్యంగా తొలి వారాంతంలో రూ. 105 కోట్ల షేర్‌ సాధించిన తొలి భారతీయ చిత్రంగా 'బాహుబలి' జెండా ఎగరేసింది. అంతకు ముందు 'ధూమ్‌' (రూ.100 కోట్లు), 'హ్యాపీ న్యూ ఇయర్‌' (రూ.99 కోట్లు) రికార్డు 'బాహుబలి' తిరగరాసినట్త్టెంది.

    అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రంగా 'రోబో' (రూ.290 కోట్లు) తొలిస్థానంలో ఉంది. ఇప్పుడు ఆ రికార్డు దిశగా 'బాహుబలి' దూసుకుపోతోంది. తొలి వారంలో కచ్చితంగా 'బాహుబలి' 'రోబో' రికార్డుని దాటుకెళ్లడం ఖాయమని ట్రేడ్‌ వర్గాలు లెక్కలుగడుతున్నాయి.

    సాధారణంగా స్టార్‌ కథానాయకుల చిత్రాలు సోమవారం నుంచి కాస్త నెమ్మదిస్తాయి. అయితే 'బాహుబలి' మాత్రం సోమ, మంగళ, బుధవారాల్లోనూ తన దూకుడు చూపిస్తోంది. నాలుగోరోజు రూ.60 కోట్లు, 5వ రోజు 44 కోట్ల షేర్‌ సాధించి.. తన జోరు తగ్గలేదని నిరూపించింది. మరి భవిష్యత్తులో 'బాహుబలి' ఇంకెన్ని ప్రకంపనాలు సృష్టిస్తుందో చూడాలని ట్రేడ్ లో ఎదురుచూస్తున్నారు.

    English summary
    Vijayendra Prasad has said recently that Rajamouli's dream is to frame the epic Mahabharata on Indian canvas. Apparently, Rajamouli once told his father before commencing Baahubali, that Baahubali is only a trailer for Mahabharata and that his real might will be unveiled in his dream project.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X