twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇటు విషాదం, అటు ప్రకృతి బీభత్సం.... నిరాశలో రజనీకాంత్ ఫ్యాన్స్!

    By Bojja Kumar
    |

    చెన్నై: కృషి ఉంటే సామాన్యుడు కూడా సూపర్ స్టార్ అవుతాడు అనడానికి రజనీకాంత్‌ను మించిన ఉదాహరణ ఉండదేమో! నేడు రజనీకాంత్ పుట్టినరోజు. ఆయన 65 సంవత్సరాలు పూర్తి చేసుకుని 66వ వడిలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం రజనీకాంత్ గానీ, ఆయన అభిమానులు కానీ బర్త్ డే సెలబ్రేషన్స్ మూడ్లో లేరు.

    జయలలిత మరణంతో తమిళనాడు వ్యాప్తంగా సంతాప దినాలు కొనసాగుతున్న నేపథ్యంలో... రజనీకాంత్ తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి సెలబ్రేషన్స్ వద్దని...పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కటౌట్లు, బేనర్లు కూడా కట్టొద్దని రజనీ ముందే అభిమానులకు లేఖ రాసాడు.

    మరో వైపు చెన్నైలో పరిస్థితి కూడా బాగోలేదు. వర్ద తుఫాన్ కారణంగా చెన్నైతో పాటు తమిళనాడు తీర ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఎవరూ ఇంట్లో నుండి భయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. గతేడాది కూడా భారీ వర్షాలు, వరదల కారణంగా రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలు జరుగలేదు. ఈ సారి కూడా మళ్లీ అలాంటి పరిస్థితే నెలకొనడంతో అభిమానులు నిరాశలో కూరుకుపోయారు.

    శివాజీ రావు గైక్వాడ్

    శివాజీ రావు గైక్వాడ్

    రజనీ కాంత్ 1950 డిసెంబర్ 12న బెంగుళూరులో శివాజీ రావు గైక్వాడ్ గా జన్మించారు. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరకముందు లేబర్ గా, బస్ కండక్టర్ గా కూడా పనిచేసారు. అతనిలోని స్టైల్ ని క్యాచ్ చేసిన కె. బాలచందర్ తను 1975లో తీసిన ‘అపూర్వ రాగన్గల్' సినిమాలో అవకాశం ఇచ్చారు.

    తర్వాత రజనీకాంత్ జీవితం మారిపోయింది

    తర్వాత రజనీకాంత్ జీవితం మారిపోయింది

    తొలి సినిమాలో ఆయనకు పెద్దగా గుర్తింపు రాలేదు. తర్వత కన్నడలో పుట్టన్న కన్నంగళ్ దర్శకత్వంలో చేసిన కథా సంగమం చిత్రంలో హీరోగా చేసినా అవకాశాలు రాలేదు. మరోసారి బాలచందర్ నుండి రజనీకాంత్ కు పిలుపు వచ్చిన తర్వాత రజనీకాంత్ జీవితం మారిపోయింది. తమిళంలో అవర్ ఒరు తోడర్ కథై, తెలుగులో అంతులేని కథ పేర్లతో వచ్చిన చిత్రాలతో రజనీకాంత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

    స్టార్‌గా ఎదిగారు

    స్టార్‌గా ఎదిగారు

    ఆ తర్వాత 1980ల్లో టాప్ తమిళ్ స్టార్ గా ఎదిగారు, 1990 లో ఎన్నో కమర్షియల్ హిట్స్ అందించారు. ‘దళపతి', ‘భాషా', ‘ముత్తు', ‘అరుణాచలం', ‘అంతులేని కథ', ‘నరసింహా', ‘చంద్రముఖి', ‘శివాజీ', ‘రోబో' మొదలైన సినిమాలు ఆయన కెరీర్లో చెప్పుకోదగ్గ కొన్ని సినిమాలు

    జపాన్, సింగపూర్ లో కూడా ఫాన్స్

    జపాన్, సింగపూర్ లో కూడా ఫాన్స్

    రజినీకాంత్ కు తెలుగు, తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషస్తులే కాదు, జపాన్, సింగపూర్ లో కూడా ఫాన్స్ ఉన్నారు. ఎంతో స్టార్ డం ఉన్నప్పటికీ రజనీకాంత్ చాలా సింపుల్ గా లైఫ్ డీల్ చేస్తారు. ప్రతి ఏడాది రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలు అభిమానులు గనంగా జరుపుకునే వారు. కానీ ఈ ఏడాది మాత్రం ఎలాంటి సెలబ్రేషన్స్ లేవు.

    English summary
    Superstar Rajinikanth who is the heart of Tamil cinema turned 66 today. Shivaji Rao Gaekwad, known by his mononymous stage name Rajinikanth, is an Indian film actor who works primarily in Tamil cinema. He began acting in plays while working in the Bangalore Transport Service as a bus conductor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X