Allu Arjun Remuneration పుష్ప 2 కోసం అల్లు అర్జున్ రికార్డు రెమ్యునరేషన్.. ప్రభాస్‌తో పోల్చితే ఎన్ని కోట్లంటే?

ఇండియన్ సినిమా పరిశ్రమలో ప్రతీ సినిమాకు తన రేంజ్‌ను పెంచుకొంటు వెళ్తున్న హీరోల్లో అల్లు అర్జున్ మొదటి వరుసలో ఉంటారు. ఒక్కో సినిమాతో భారతీయ సినిమా పరిశ్రమ మెట్లను ఎక్కుకొంటూ అగ్రస్థానానికి చేరుకొనే ప్రయత్నం చేస్తున్నారు. దక్షిణాదిలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఐకాన్ స్టార్.. పుష్ప మూవీ తర్వాత పాన్ ఇండియా స్థాయికి తన ఇమేజ్ పెంచుకొన్నారు. ఇక పుష్ప ది రూల్ సినిమాలో నటించినందుకు అల్లు అర్జున్ తీసుకొన్న రెమ్యునరేషన్ వివరాల్లోకి వెళితే..

పుష్ప ది రైజ్ సినిమాతో తన కెరీర్‌ను ఫుల్ రైజింగ్ చేసిన అల్లు అర్జున్.. ఇంటర్నేషనల్ స్థాయిలో తన బ్రాండ్ క్రియేట్ చేసుకొన్నారు. పుష్ప అందించిన సంచలన విజయం ఆయనను ఇండియాలోనే స్టార్ హీరోగా నిలబెట్టింది. ఇక పుష్ప 2 సినిమాతో తన రేంజ్‌ను మరింత పెంచుకొన్నారు.

Allu Arjun Remuneration for Pushpa 2 Here is the full details
పుష్ప 2 కు సంబంధించిన ప్రమోషన్స్ ఊపందుకోవడంతో ఈ సినిమా బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరుగుతున్నదంటే.. అందుకు కారణం అల్లు అర్జున్‌కు దేశవ్యాప్తంగా ఏర్పడిన ఫాలోయింగ్. ఈ సినిమా బిజినెస్ నిర్మాతలకు కోట్ల రూపాయలు కురిపిస్తున్నది. ప్రీ రిలీజ్ బిజినెస్ షాకింగ్‌గా మారింది.
Allu Arjun Remuneration for Pushpa 2 Here is the full details
ఇక పుష్ప సినిమాకు అల్లు అర్జున్ తీసుకొంటున్న పారితోషికం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఈ సినిమా కోసం ఆయన సుమారుగా 150 కోట్ల నుంచి 175 కోట్ల రూపాయలు తీసుకొంటున్నట్టు సమాచారం. కొంత నగదు రూపంలోను, మరికొంత ప్రాఫిట్ షేరింగ్, హక్కుల రూపంలో తీసుకొన్నట్టు తెలుస్తున్నది.
సీక్రెట్‌గా మంజుమ్మల్ బాయ్స్ హీరో పెళ్లి .. గుట్టు చప్పుడుగా యంగ్ హీరోయిన్‌తో వివాహం

తాజాగా అల్లు అర్జున్ తీసుకొంటున్న రెమ్యునరేషన్ గురించి పరిశీలిస్తే.. తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. చిరంజీవి లాంటి మెగాస్టార్ మినహాయిస్తే.. యువ హీరోల్లో ప్రభాస్ తర్వాత ఐకాన్ స్టార్ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకొంటున్నట్టు తెలుస్తున్నది. పుష్ప 2 హిట్ అయితే ఆయన రేంజ్ మరోస్థాయికి వెళ్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X