Don't Miss!
- Automobiles విమానంలో ప్రేమ కావ్యం.. అద్భుతమైన సన్నివేశానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
- Finance Uday Kotak: కోటక్ బ్యాంక్ స్టాక్ క్రాష్.. పాపం ఉదయ్ కోటక్.. ఎంత నష్టపోయారంటే..
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
టైటిల్ లో సత్తా ఉంది... అంచనాలు రీచ్ అవుతారా..?
చెన్నై : ప్రస్తుతం తమిళంలో ఉన్న టాప్ హీరోల్లో శివకార్తికేయన్‌కు ప్రత్యేకస్థానముంది. శివ నటించిన 'ఎదిర్‌నీచ్చల్', 'వరుత్తపడాద వాలిబర్ సంఘం', 'మాన్‌కరాటే' వంటి పలు చిత్రాలు కమర్షియల్‌గా విజయం సాధించి శివకార్తికేయన్ ప్రత్యేకతను చాటాయి. ఈ వరుసలో వస్తున్న కొత్త చిత్రం 'కాక్కిసట్టె'.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఎదిర్‌నీచ్చల్' మంచి విజయాన్ని సాధించింది. తన కెరీర్‌లో పోలీసు అధికారిగా తొలిసారిగా నటిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. శ్రీదివ్య హీరోయిన్ గా నటించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చారు.
తమిళనాడులో ఏకంగా 400 థియేటర్లలో సినిమా విడుదల కానున్నట్లు సమాచారం. ఇక ఇతర ప్రాంతాల్లో 300 థియేటర్ల వరకు విడుదలవుతున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా భారీ స్థాయిలో ఉంటుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
చిత్రం విషయం ఇలా ఉంటే....
నటుడు ధనుష్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని తమిళ హీరో శివకార్తికేయన్ తెలిపారు. శివకార్తికేయన్ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాక.. ఆయనకు పెద్ద చేయి అందించి.. పెద్ద చిత్రాల్లో నటింపజేసిన ఘనత ధనుష్‌దే. 'ఎదిర్‌నీచ్చల్' వంటి చిత్రాన్ని నిర్మించి శివకార్తికేయన్‌కు హిట్‌కు ఇచ్చారు. తాను నటించిన '3' సినిమాలో కూడా కీలకమైన పాత్రలో అవకాశం ఇచ్చారు.
అంతేకాకుండా తాజాగా 'కాక్కిసట్టె' చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటోందని మీడియాలో ప్రచారం సాగుతోంది. దాంతో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఈ విషయమై పెద్ద చర్చ నడుస్తోంది. హీరో ఫ్యాన్స్ మధ్య తిట్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో తనకు ఎలాంటి విభేధాలు లేవని వివరణ ఇచ్చారు.
శివకార్తికేయన్ మాట్లాడుతూ.. వాస్తవానికి మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మా స్నేహం అలాగే కొనసాగుతోంది. 'కాక్కిసట్టె' సినిమా కార్యక్రమానికి ధనుష్ హాజరుకాక పోవడంతో ఇలాంటి వదంతులు వ్యాపిస్తున్నాయి. ఆయన మమ్మల్ని పూర్తిగా నమ్మారు. బడ్జెట్ కూడా ప్రారంభంలో నిర్ణయించకుండా.. అంతా మా చేతుల్లోనే పెట్టేశారు. పోలీసు పాత్రలో నటించగలననే ఆత్మవిశ్వాసాన్ని నాలో నింపింది ధనుషే. 'కాక్కిసట్టె' నేను నటిస్తున్న ఏడో చిత్రం. తక్కువ కాలంలో ఇంత స్టార్‌డమ్‌ను అందించిన ప్రేక్షకులకు ఎప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు.