Double ISMART: రామ్ కోసం రంగంలో బాలయ్య విలన్.. యానిమల్ రేంజ్‌లో వైల్డ్ యాక్షన్
తెలుగు చిత్ర పరిశ్రమలో సీక్వెల్ మూవీల సందడి కనిపిస్తోంది. ఒక సినిమా సూపర్ హిట్ అవగానే దానికి కొనసాగింపుగా మరో మూవీని తెరకెక్కించే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఇలా ఇప్పటికే టాలీవుడ్‌లో చాలా చిత్రాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా పలు సీక్వెల్స్ పట్టాలెక్కేశాయి. అందులో ఇస్మార్ట్ శంకర్‌కు కంటిన్యూగా వస్తున్న 'డబుల్ ఇస్మార్ట్' ఒకటి.
పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమానే 'డబుల్ ఇస్మార్ట్'. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన సూపర్ హిట్ అయిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీకి ఇది సీక్వెల్‌గా రూపొందుతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

'డబుల్ ఇస్మార్ట్' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. అంతేకాదు, చిత్రీకరణ కూడా శరవేగంగానే సాగుతోంది. ఇందులో హీరో రామ్‌తో పాటు కీలక పాత్రను చేస్తున్న పలువురు నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు కూడా పలు షెడ్యూళ్లను ప్లాన్ చేసి వీలైనంత త్వరగా దీన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.
రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న 'డబుల్ ఇస్మార్ట్' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందిస్తోన్నారు. అందుకు అనుగుణంగానే నేషనల్ క్రేజ్ ఉన్న నటులను తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఈ చిత్రంలో ముఖ్యమైన ఓ పాత్రకు బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్‌ను తీసుకున్నారట.

తాజా సమాచారం ప్రకారం.. 'డబుల్ ఇస్మార్ట్' మూవీలో బాబీ డియోల్ ఓ అదిరిపోయే వైల్డ్ రోల్‌ను చేస్తున్నాడని తెలిసింది. 'యానిమల్' మూవీకి మించేలా ఇందులో అతడి ఎలివేషన్స్ ఉంటాయని తెలిసింది. త్వరలోనే బాబీ ఈ సినిమా సెట్స్‌లోకి వస్తాడని అంటున్నారు. ఇక, ఈ బడా స్టార్ రాకతో 'డబుల్ ఇస్మార్ట్' మూవీపై ఉన్న అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. 'డబుల్ ఇస్మార్ట్' మూవీని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్ కీలకమైన పాత్రను చేస్తున్నాడు. అలాగే, ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం ఇస్తున్నారు. ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











