డార్క్ సీక్రెట్.. దర్శకుడితో పడుకోవాలని చెప్పారు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!
Recommended Video

కాస్టింగ్ కౌచ్ పై దేశవ్యాప్తంగా పోరాటం ఉదృతం అవుతున్నట్లు కనిపిస్తోంది. కాస్టింగ్ కౌచ్ వివాదం టాలీవుడ్ ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అగ్గి రాజేసుకుంది. నేరుగా ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బిబిసి బాలీవుడ్ లో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ వ్యవహారాల గురించి బాలీవుడ్ డార్క్ సీక్రెట్ పేరుతో డాక్యుమెంటరీ ప్రసారం చేయనుంది. ఈ డాక్యుమెంటరీ కోసం ప్రముఖ హీరోయిన్లు సంచలన విషయాలు వెల్లడించారు. రాధికా ఆప్టే, ఉషా జాదవ్ వంటి ప్రముఖ హీరోయిన్లు ఈ డాక్యుమెంటరీలో భాగమైన బాలీవడ్ లో జరుగుతుం చీకటి కోణాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. హాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై మీ టూ అనే పెద్ద ఉద్యమమే సాగుతోంది.

సరోజ్ ఖాన్ వ్యాఖ్యలతో
ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కాస్టింగ్ కౌచ్ ని సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలతో అగ్గి రాజేసుకుంది. ఆమె వ్యాఖ్యపట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇండస్ట్రీలో మహిళలని రేప్ చేసి రోడ్డుమీద వదిలేయడం లేదని అందుకు బదులుగా వారికి జీవనోపాది దక్కుతోందని చెప్పిన సరోజ్ ఖాన్ వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారాయి.

బిబిసి డాక్యుమెంటరీ
బాలీవడ్ లో జరుగుతుం కాస్టింగ్ కౌచ్ గురించి అంతర్జాతీయ మీడియా సంస్థ బిబిసి సంచలన డాక్యుమెంటరీని ప్రసారం చేయబోతోంది. కాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురుకోన్న హీరోయిన్ల అభిప్రాయాలతో ఈ డాక్యుమెంటరీని సిద్ధం చేసారు. రాధికా ఆప్టే, ఉషా జాదవ్ వంటి ప్రముఖ హీరోయిన్లు తమ చేదు అనుభవాలని బిబిసి తో పంచుకున్నారు.

తమకు తామే దేవుళ్లమని
ఇండస్ట్రీలో కొంత మంది తమకు తామే దేవుళ్లమని భావిస్తారని వారికీ ఎదురు తిరిగితే కెరీర్లు నాశనం అయినట్లే అని రాధికా ఆప్టే పేర్కొంది. మహిళలు, పురుషులు కలసి కట్టుగా ముందుకు వచ్చి దీనికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలని రాధికా ఆప్టే పేర్కొంది.

దర్శకుడితో పడుకోవాలని
జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రముఖ హీరోయిన్ ఉషా జాదవ్ కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన కెరీర్ ఆరంభంలో ఇలాటి అనుభవం ఎదురైందని తెలిపింది. అవకాశం రావాలంటే నిర్మాతతో, దర్శకుడితో పడుకోవాలని చెప్పారని వ్యాఖ్యానించింది. ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్న అమ్మాయిలు అంతా ముందుకు వచ్చి పోరాటం చేయవలసిన అవసరం ఉందని ఉషా జాదవ్ పేర్కొంది.

వర్థమాన నటి అనుభవం
మరో వర్తమాన నటి బిబిసి డాక్యుమెంటరీలో సంచలన విషయాలు వెల్లడించింది. ఇండస్ట్రీలో అవకాశం దొరకాలంటే వీలు దొరికప్పుడల్లా శృంగారంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారని తెలిపింది. ఓ వ్యక్తి తాను కోరుకున్నపుడల్లా వచ్చి తాకేవాడు.. ముద్దు పెట్టుకునే వాడు, అతడి ప్రవర్తన నన్ను షాక్ కి గురిచేసిందని వర్థమాన నటి డాక్యుమెంటరీలో వెల్లడించింది.


Click it and Unblock the Notifications











